వివాదానికి తెర దించినందుకు కత్తికి థాంక్స్ అంటున్న కోన !

Saturday, January 20th, 2018, 09:42:59 AM IST

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కి పవన్ కళ్యాణ్ అభిమానులకి మధ్య మాటల యుద్ధం ఎంత పెద్ద వివాదానికి తెరలేపిందో రోజూ చూస్తూనే వున్నాం. చివరకు కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పే వరకు ఈ వివాదాన్ని ఆపేది లేదని చెప్పారు. అయితే నిన్న ఈ విషయమై ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ చర్చలో పాల్గొనడానికి కత్తి మహేష్ వచ్చారు. అదే సమయం లో చర్చ జరుగుతుండగా జనసేన పార్టీ కార్యాలయం నుండి ఆ పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి మీడియా కు ఒక లేఖ విడుదల చేశారు. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సంయమనం తో ఉండాలని, ఎటువంటి దాడులకు దిగవద్దని ఆ లేఖ సారాంశం. దీనితో కత్తి మెత్తబడ్డారు. పవన్ అభిమానుల పై పెట్టిన కేసు కూడా తవరలో ఉపసంహరించుకునే దిశగా ఆలోచిస్తున్నారని తెలియవస్తోంది. అయితే ఈ విషయం పై కోన వెంకట్ స్పందిస్తూ ఈ వివాదానికి ముగింపు పలికిన మిత్రుడు కత్తి మహేష్ కి ధన్యవాదాలు, మీ కెరీర్ బాగుండాలి. ఇక పై ఎవరు కూడా మీ పై దూషణలు కానీ, దాడులకు గాని దిగరు. ఒకవేళ అలా చేసినట్లయితే వారు అసలు పవన్ కి శత్రువులవుతారు నన్ను నమ్ము అని అన్నారు, ఈ మాటలతో పాటు పవన్ ఫాన్స్ తో కత్తి మహేష్ దిగిన ఫోటో ఒకటి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వివాదం ముగింపుపలికిన కత్తి మహేష్ తో కలిసి కొందరు పవన్ అభిమానులు నిన్న పార్టీ కూడా చేసుకున్నారని సమాచారం. ఏది ఏమయినప్పిటికి దాదాపు మూడు నెలలనుండి జరుగుతున్న ఈ వివాదానికి ఇప్పటికి ముగింపు పలకడం సంతోషమని విశ్లేషకులు అంటున్నారు….