పవన్ గారికి కృతజ్ఞతలు, రకుల్ కు క్షమాపణలు : శ్రీ రెడ్డి

Monday, April 23rd, 2018, 03:24:04 PM IST

ఇటీవల కాస్టింగ్ కౌచ్ విషయమై కొద్దిరోజులుగా తన నిరసనతో టాలీవుడ్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న శ్రీరెడ్డి నేడు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు క్షమాపణలు చెప్పారు. కొద్దిరోజుల క్రితం రకుల్ ప్రీత్ కాస్టింగ్ కౌచ్ వంటివి తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేవని అనడంతో ఆమె పై ఫైర్ అయిన శ్రీరెడ్డి, అప్పట్లో తాను చేసిన పనికి బాధపడుతున్న అని, రకుల్ నిన్ను బాధించివుంటే నన్ను క్షమించు అని చెప్పారు. అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచితవ్యాఖ్యలకు ఇటీవల క్షమాపణ చెప్పిన ఆమె నేడు పవన్ త్వరలోనే ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చెపుతూ, హర్షం వ్యక్తం చేసింది.

పవన్ కల్యాణగారి అభిమానులు కొందరు అక్క తిన్నావా, ఎలా వున్నావ్ అంటూ మెస్సేజిలు చేస్తున్నారని, అటువంటి మెసేజిలు చదువుతుంటే తనకు కళ్ల వెంట నీళ్లు తిరుగుతున్నాయని ఆమె తన పేస్ బుక్ ఖాతా ద్వారా చెప్పుకొచ్చారు. మరొక మాట చెపుతూ సర్ మీరు మీడియా పై చేస్తున్న పోరాటం బాగుంది, కానీ మీడియాని నిషేధించడం ఎవరివల్ల కాదు కదా సర్. అందువల్ల మీరు మరొక సరి ఆలోచించండి. అందులోను ఎన్నికలు దగ్గర్లోనే వున్నాయి. మీడియా వాళ్ళతో ఎందుకు సర్ గొడవలు అంటూ ఆమె పవన్ ని ఉద్దేశించి ట్వీట్ చేశారు……

  •  
  •  
  •  
  •  

Comments