లైగికంగా వేధించిన నటుడు ఎవరో చెప్పేసిన బాలీవుడ్ హీరోయిన్ ?

Wednesday, September 26th, 2018, 01:28:48 PM IST


సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పై ఇప్పటికే పలువురు హీరోయిన్స్ బహిరంగంగా చెప్పేస్తున్నారు. తాజాగా తనపై కూడా ఈ లైంగిక వేధింపులు జరిగాయని .. బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్త చెప్పడమే కాకుండా వారి పేర్లు కూడా బయట పెట్టడంతో పెద్ద దుమారమే రేగుతుంది. 2008 లో హార్న్ ఓకే ప్లీజ్ సినిమాలో తాను నటిస్తున్నప్పుడు ఓ పాటలో నానా పాటేకర్ తనతో సన్నిహితంగా నటించాల్సి వచ్చిందని, ఆ సమయంలో అయన లైంగికంగా వేధించాడని, తాకారని చోట తాకాడని చెప్పింది. ఈ పాట గురించి తనకు ముందు చెప్పలేదని, నాకు తెలియకుండా షూటింగ్ చేసారని అంది. అంతే కాకుండా మరికొందరి పేర్లు కూడా బహిర్గతం చేసింది. వారిలో నిర్మాత సామీ సిద్ధిఖీ, దర్శకుడు రాకేష్ సంగ్ , కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా ఉన్నారని పేర్కొంది. తనకు ఎదురైనా వేధింపుల గురించి చెబితే ఎవరు అప్పుడు పట్టించుకోలేదని ఘాటు కామెంట్స్ చేసింది. తాజాగా మీ టూ ప్రచారం పై తనుశ్రీ దత్త స్పందిస్తూ ఇలా పెద్ద బాంబులు పేల్చడంలో బాలీవుడ్ లో నానా రచ్చ జరుగుతుంది.