న్యూ లుక్ లో అదరగొట్టిన తారక్ !

Tuesday, January 16th, 2018, 03:15:40 PM IST

యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరో గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో హారిక, హాసిని క్రియేషన్స్ పతాకం పై రాధాకృష్ణ నిర్మించనున్న నూతన చిత్రం ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా ప్రారంభమయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రం మంచి ఫామిలీ ఎమోషన్స్ , రిలేషన్స్ తో కూడినదని, తదనుగుణంగా ఎన్టీఆర్ పాత్ర కూడా కొత్తగా ఉంటుందని, అందుకు గాను ఆయనను దర్శకులు త్రివిక్రమ్ కొంత మేర శారీరక బరువు తగ్గమని సలహాఇచ్చినట్లు చెపుతున్నారు. జై లవకుశ చిత్రం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న యన్ టి ఆర్, దాదాపు చాలా వారల నుండి బరువు తగ్గేందుకు ప్రముఖ బాలీవుడ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో శిక్షణ పొందినట్లు తెలుస్తోంది.

అయితే బరువు తగ్గిన యన్ టి ఆర్ చాలా బాగున్నారని, న్యూ లుక్ లో ఇంకా హ్యాండ్సమ్ గా వున్నారని ఆయన సన్నిహితుల సమాచారం. ఇప్పటివరకు బరువు తగ్గిన యన్ తో ఆర్ ఫొటోస్ ఏవి బయటకి రాకపోవడంతో అభిమానులు ఆయన న్యూ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నేడు తారక్, బాలీవుడ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ కు సంక్రాంతి సందర్భంగా గాలి పటం ఎగురవేయడం నేర్పుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ ఫోటో లో తారక్ న్యూ లుక్ లో అదరగొట్టినట్లు తెలుస్తోంది, గడ్డం వున్నా కానీ చాలా స్లిమ్ అయినట్లు అర్ధం అవుతోంది. ఫామిలీ ఎంటర్టైనర్ అన్నారు కాబట్టి ఇదివరకు ఆయన చేసిన బృందావనం మాదిరిగా ఉంటుందేమో ఈ సినిమా అని ఫాన్స్ ఇప్పటి నుండే చర్చలు మొదలుపెట్టారు…