#RRR లో కూడా తారక్ సరికొత్త లుక్!

Tuesday, May 1st, 2018, 06:05:23 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో సరికొత్త లుక్స్ లో దర్శనమిస్తూ అభిమానులకు మంచి కిక్ ఇస్తున్నాడు. జై లవకుశ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న తారక్ ఈ ఏడాది రెండు ప్రాజెక్టులతో బిజీ కానున్నాడు. ముందుగా త్రివిక్రమ్ ప్రాజెక్టును రీసెంట్ గా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం తారక్ తన లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో జిమ్ వర్కౌట్స్ చేసి ఫిట్ నెస్ లో చాలా మార్పులు చేశాడు. రీసెంట్ గా స్టీవెన్ తారక్ కి గుడ్ బాయ్ చెప్పేశాడు. అయితే #RRR సినిమా కోసం స్టీవెన్ మళ్లీ హైదరాబాద్ కి వస్తాడట. రాజమౌళి తారక్ పాత్ర గురించి ముందే ఒక వివరణ ఇచ్చాడట. ఎప్పుడైతే త్రివిక్రమ్ క్యారెక్టర్ ఎండ్ అవుతుందో అప్పుడే సరికొత్తగా కనిపించాడానికి మరో కొత్త ఆకృతి కోసం జిమ్ వర్కవుట్స్ చేస్తాడట. అప్పుడు ట్రైనర్ స్టీవెన్ మళ్లీ రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments