ఆ క్యారెక్టర్ అమీర్ చేయవలసింది : ‘సంజు’ చిత్ర దర్శకుడు

Sunday, May 20th, 2018, 12:48:50 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఏ చిత్రంలో నటించినా చాలా జాగ్రత్త ఆ పాత్రకు తగ్గట్లు తన క్యారెక్టర్ ను మలుచుకుని ఎంతో శ్రద్ధతో నటిస్తుంటారు అనే విషయం అందరికి తెలిసిందే. అందుకే ఆయన్ను అందరూ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని అంటుంటారు. ప్రస్తుతం యంగ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా సంజు చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ చిత్రంలో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రకు తొలుత దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ అమీర్ ను తీసుకోవాలనుకున్నారట. నేను ఏ చిత్రం చేసినా ముందు ఆమిర్ ను కలిసి ఆ చిత్ర వివరాలు చెపుతుంటాను అలానే సంజు చిత్ర కథ చెప్పినపుడు ఆయన బాగుంటుంది తప్పక చేయండి అన్నారు.

అలానే సంజయ్ తండ్రి సునీల్ దత్ పాత్రలో ఆయన నటిస్తాను అన్నారు. కాకపోతే ఆ తరువాత దంగల్ చిత్రం అనౌన్స్ చేయడం, అందులో కూడా ఒక నడివయసు గల తండ్రిగా నటిస్తూ, మళ్ళి సంజులో కూడా అదే పాత్ర చేయడం ఇష్టం లేక ఆయన చిత్రం నుండి తప్పుకున్నట్లు రాజ్ కుమార్ హిరానీ తెలిపారు. కాగా ఇప్పటికే విడుదలయిన సంజు చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని, ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు రణబీర్ అచ్చం సంజయ్ లానే వున్నదని అంటున్నారని అన్నారు. నిజానికి సంజయ్ లా కనపడడు రణబీర్ ఎంతో శ్రమపడ్డాడని చెప్పుకొచ్చారు రాజ్ కుమార్. కాగా ఈ చిత్రం జూన్ 29 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది……

  •  
  •  
  •  
  •  

Comments