సోషల్ మీడియాకి ఆ యాంకర్ రీఎంట్రీ!!

Monday, March 19th, 2018, 05:03:41 PM IST

ఇటీవల కాలంలో జబర్దస్త్ షో తో మంచి పాపులారిటీ సంపాదించిన భామ అనసూయ ఆమె అంతకు ముందు నుండి టివి షోల్లో కనిపిస్తున్నప్పటికీ, మంచి పాపులారిటీ వచ్చింది మాత్రం ఆ షో తోనే. ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు కూడా వరుసగా వచ్చాయి కూడా. తనకు మంచి పాపులారిటీ వచ్చినప్పటినుండి అనసూయ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే మొన్న ఆ మధ్య తన కుమారుడు అనసూయను ఫొటో తీస్తుంటే సెల్ ఫోన్ పగలగొట్టి, దుర్భాషలాడిందంటూ ఓ మహిళ అనసూయపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ కాగా, పలువురు నెటిజెన్లు ఆమె వ్యవహారశైలి పట్ల విరుచుకుపడ్డారు.

అయితే సదరు మహిళ తనపై అబద్దపు వ్యాఖ్యలు చేస్తోందంటూ అనసూయ చెప్పినప్పటికీ, నెటిజెన్ల దాడి కొనసాగింది. దీంతో, కొంత కాలం పాటు ట్విట్టర్, ఫేస్ బుక్ కు దూరంగా ఉంటున్నట్టు అనసూయ ప్రకటించారు. ఫిబ్రవరి 6వ తేదీన తన అకౌంట్లను డిజేబుల్ చేశారు. మొత్తానికి తాజాగా నిన్న ఆ అకౌంట్ల ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. ఫేస్ బుక్ అకౌంట్ ను నిన్న యాక్టివేట్ చేసి, రంగస్థలం ట్రైలర్ ను అప్ లోడ్ చేశారు. అలానే ట్విట్టర్ అకౌంట్ ను ఈ రోజు యాక్టివేట్ చేసిన ఆమె రంగస్థలం సినిమాలో తాను పోషించిన రంగమ్మత్త ఫొటోను పోస్ట్ చేసి ఆమె అభిమానులకు శుభవార్త అందించారు….