హీరోయిన్ బుగ్గ గిల్లిన అభిమాని….షాక్ తిన్న హీరోయిన్!

Tuesday, April 17th, 2018, 08:25:52 PM IST


దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో తన అందం, అభినయంతో యువతని కట్టిపడేసిన బాలీవుడ్ బ్యూటీ హన్సిక.ఆ సినిమా అద్భుత విజయం తరువాత వరుస విజయాలతో దక్షిణాది టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తాజాగా గులేబాకావళి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. కాగా ఆమెకు నిన్న ఒక వింత అనుభవం ఎదురైంది. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడులోను హన్సికకి వీరాభిమానులనున్నారు. వారితోనే ఇప్పుడు ఆమెకి ఇబ్బంది కలిగింది. నిన్న చెన్నైలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన ఆమెని చూసేందుకు అక్కడికి చాలామంది అభిమానులు వచ్చారు. ఆమె కారునుంచి దిగి మాల్ లోకి వెళ్ళడానికి వీలులేనంత ఫ్యాన్స్ వచ్చారు.

ఆ జనం మధ్యనుండి బౌన్సర్ల సహాయంతో నడిచివెళ్తుంటే, ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని అభిమానులు తోసుకున్నారు. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినప్పటికీ వారిలో ఓ అభిమాని హఠాత్తుగా హన్సిక బుగ్గని గిల్లాడు. దీంతో హన్సిక షాక్ తిని చెంప పై చెయ్యి పెట్టుకొని మాల్ లోకి వెళ్ళింది. ఈ ఘటన మొత్తం కెమెరాలో బంధించబడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక నుంచి అయినా పబ్లిక్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు తారలు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఇలాంటి విచిత్ర అనుభవాలు తప్పవని సైన్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు…..