ఇగో సమస్యలతో చిక్కుల్లో ఆ హీరో కెరీర్?

Wednesday, May 23rd, 2018, 05:44:49 PM IST

ప్రస్తుతం పెద్ద హీరోల చిత్రాలతోపాటు చిన్న చిత్రాలు కూడా విజయవంతం అవుతున్నాయి. అర్జున్ రెడ్డి, చలో, పెళ్లి చూపులు, ఫిదా వంటి చిత్రాలు ఎంతటి అద్భుత విజయాన్ని అందుకున్నాయి మనకు అందరికి తెలిసిందే. అయితే చలో చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యువ నటుడు నాగ శౌర్య, ఆ చిత్రం తరువాత వచ్చిన పేరుని తరువాత చిత్రాలతో కొనసాగించలేకపోతున్నాడనేది ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల సమాచారం. చలో తర్వాత విడుదలయిన కణం చిత్రం కేవలం మొదటివారం కూడా పూర్తికాకుండానే చాలావరకు థియేటర్ల నుండి దాన్ని తొలగించారంటే దానికి ప్రధాన కారణం ఆ చిత్రానికి సరైన రీతిలో ప్రమోషన్లు చేయకపోవడమేనని, మరీ ముఖ్యంగా హీరో నాగ శౌర్యకి హీరోయిన్ సాయిపల్లవికి మధ్య కొన్ని బేధాభిప్రాయాలు ఏర్పడడంతో ఇద్దరు చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. తత్ఫలితంగా చిత్రం ఘోర పరాయజయాన్ని మూటగట్టుకుంది. కాగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న నూతన చిత్రం అమ్మమ్మగారిల్లు విషయంలోకూడా నాగ శౌర్య ఇదే విధంగా తన ఇగో సమస్యలతో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదట.

చిత్రీకరణ సమయంలో నిర్మాతలతో కొన్ని ఫైనాన్సియల్ సమస్యలు తలెత్తడంతో శౌర్య తన పనిగా నటించి ప్రమోషన్స్ పై దృష్టిపెట్టడం లేదని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలయిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ తో చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడడం, అందునా మంచి ఫామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. దీనిని మరింతగా కనుక ప్రమోట్ చేస్తే చిత్రాన్ని మంచి విజయం దిశగా తీసుకెళ్లొచ్చని, అయితే శౌర్య మాత్రం ప్రమోషన్లపై పెద్దగా ఆసక్తి చూపడంలేదని అంటున్నారు. ఇందులో ఎంతమేరకు నిజం ఉందొ తెలియదుగాని, ఈ విధంగా ఆయన వైఖరికనుక కొనసాగితే, భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురై మొత్తం కెరీర్ కొద్దిరోజుల్లో గాడి తప్పడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు…….

  •  
  •  
  •  
  •  

Comments