రూ.2 కోట్ల ఆఫర్ ను వదులుకున్న భామ?

Friday, April 6th, 2018, 03:12:26 PM IST


లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన కాజల్, తరువాత చేసిన చందమామ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. అలానే రెండు భాషల్లోని అగ్రకథానాయకులతోను ఆమె ఎన్నో సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకి కోటి రూపాయల వరకూ పారితోషికం తీసుకుంతున్నట్లు సమాచారం. అయితే కాజల్ కి రెండు కోట్లు ఇస్తామంటూ రీసెంట్ గా ఒక బంపర్ ఆఫర్ వచ్చిందట. ప్రముఖ తమిళ దర్శకుడు పి.వాసు, కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఆయన వున్నారు. ఈ సినిమాలో టైటిల్ రోల్ కి కాజల్ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించిన ఆయన, రెండు కోట్లు ఆఫర్ చేశారట. అనుష్క, నయనతార మాదిరిగా పూర్తి స్థాయి హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలను తాను ఇంతవరకూ చేయలేదనీ, ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని ఆ భారీ ఆఫర్ ను సున్నితంగా కాజల్ తిరస్కరించారని సినీ వర్గాల అందుతున్నసమాచారం. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదుకానీ, ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది….

  •  
  •  
  •  
  •  

Comments