నా గుండెను బద్దలు చేసిన వార్త అది : అల్లు అర్జున్

Sunday, May 13th, 2018, 11:02:04 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానుల కోసం ఎంతదూరమైనా వారు కష్టాల్లో ఉంటే వెళ్లి కలిసి వారి ఆఖరి కోరిక తీర్చిన ఉదంతాలు మనం ఇదివరకు చూసాము. కాగా ఇటీవల విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లో కాన్సర్ తో బాధపడుతున్న సాయి గణేష్ తన ఆఖరికోరికగా బన్నీ ని కలవాలనుకున్నాడు. అయితే కొందరు అభిమానులద్వారా ఆ విషయం తెలుసుకున్న బన్నీ చివరికి ఆ యువకుడిని కలుసుకున్నారు. అతడికి దైర్యం చెప్పి కాన్సర్ నుండి అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అయితే నేడు బన్నీ తన బాధాతప్త హృదయం తో తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు. నేను మొన్న వెళ్లి కలిసిన నా అభిమాని సాయి గణేష్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు మరణించాడని ఇప్పుడే తెలిసింది. ఆ విషయం విన్న నాకు ఒక్కసారిగా గుండె బద్దలయింది. ఆ భగవంతుడు అతని ఆత్మకు శాంతిని చేకూర్చాలని, అతని కుటుంబసభ్యులకు నా తరపున ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను అని పోస్ట్ చేశారు……