అంతేగా – చంద్రబాబు అంటే అంతే మరి…

Friday, June 14th, 2019, 12:52:06 AM IST

ఇటీవల ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ పార్టీ దారుణమైన ఓటమిపాలైన సంగతి మనందరికీ తెలిసిందే… మొత్తం 175 స్తనకు గాను కేవలం 23 స్థానాలతోనే సరిపెట్టుకుంది టీడీపీ. అసలు ఈ ఫలితాలని ఎవ్వరు కూడా ఊహించలేదని చెప్పాలి… చంద్రబాబు తనకంటే చాలా చిన్నవాడైన జగన్ చేతిలో అంత దారుణంగా ఓడిపోతాడని ఎవరు కూడా అనుకోని ఉండరు. కాగా ఏపీలో కొత్త ప్రభుత్వ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి కూడా. ఈమేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవర్తన అసెంబ్లీలో ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కానీ చంద్రబాబు కి ఉన్నటువంటి రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి అసెంబ్లీలో అధికార పక్షాన్ని చంద్రబాబు చాలా గట్టిగానే ఎదుర్కొంటున్నాడు.

కాగా సభలో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు గొంతు కి ఏమైంది, మాట సరిగ్గా రావడంలేదా అని వైసీపీ నేతలు వెటకారం ఆడుతున్నారు. ఆ మాటలను విన్నటువంటి చంద్రబాబు తాగ్గింది నా వాయిస్ కాదు మైక్ వాయిస్ అని చంద్రబాబు చురకలంటించారు. ఈ మాటతో వైసీపీ నేతలందరూ కూడా చల్లబడ్డారని చెప్పాలి. అంతేకాకుండా చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు పయ్యావుల కేశవ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా వైసీపీ నేతలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కాగా స్పీకర్ ఎన్నిక విషయంలో తనను సంప్రదించనందుకే తమ్మినేని సీతారాం బాధ్యతల స్వీకరణ సమయంలో దూరంగా ఉన్నానని చంద్రబాబు అన్నారు.