అది మరి హరీష్ రావు అంటే…

Tuesday, September 10th, 2019, 01:01:26 AM IST

తెలంగాణాలో తెరాస పార్టీ మరొకసారి అధికారాన్ని దక్కించుకున్న తరువాత గతంలోని కీలక నేతలందరికీ కూడా చాలా కీకాలమైన బాధ్యతలు వస్తాయని చాలా మంది నేతలు గంపెడు ఆశలతో కసుకుకూర్చున్నారు. కానీ కొన్ని సమీకరణాల వలన వారి ఆశాలన్నింటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గండి కొట్టారని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వారికి మాజీ తెరాస పార్టీ కీలకనేత హరీష్ రావు కూడా ఒకరు. అయితే కెసిఆర్ తన కొడుకు కేటీఆర్ కి పార్టీ బాధ్యతలను అప్పగించి, హరీష్ రావు ని దూరం పెట్టారు. కాగా హరీష్ రావు ని కావాలనే పత్తికి దూరం చేయాలనీ కెసిఆర్ ప్లాన్ వేశారని అందరు కూడా అనుకున్నారు. ఈమేరకు తెలంగాణాలో ఉన్నటువంటి ఇతర పార్టీలు అన్ని కూడా తెరాస లో అసమ్మతిగా ఉన్నటువంటి నేతలందరినీ సంప్రదించి తమ పార్టీ లోకి లాక్కెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేశాయి.

అంతేకాకుండా ఈటెలను మంత్రి వర్గం నుండి తప్పిస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి.. అయితే వాటన్నింటికి తెరతీస్తూ హరీష్ రావు కి ఎంతో కీలకమైన ఆర్థిక శాఖ ని అప్పగించి, ఈటెల స్థానానికి కూడా ఎలాంటి సమస్య రాకుండా చేశారు ముఖ్యమంత్రి కెసిఆర్. అయితే ఎలాగైనా సరే తెలంగాణాలో బలపడాలని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి బీజేపీ పార్టీ హరీష్ రావు తో పాటు ఈటెల, మరికొందరు నాయకులను కూడా బీజేపీ లో చేర్పించుకోడానికి చాల ప్రయత్నాలు చేశారు. అయితే కెసిఆర్ వారికి దిమ్మదిరిగే సమాధానంగా హరీష్ రావు కి మంత్రి పదవిని అప్పగించారు. కాగా తెరాస వదిలి వెళ్లాలనుకున్నవారందరిని కూడా హరీష్ రావు సముదాయించారని సమాచారం. అంటే తెలంగాణాలో ఇక తెరాస పార్టీ కి మళ్ళీ ఎదురులేకుండా తయారైంది అని సమాచారం. కాగా హరీష్ రావు బలం ఏంటో కెసిఆర్ కి మరొకసారి అర్థమైందని తెలుస్తుంది.