రోజా రేంజ్ అంటే ఇలా ఉండాలి మరి…

Tuesday, August 20th, 2019, 12:52:11 AM IST

ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నగరి ఎమ్మెల్యే రోజా హవా మొదలైందనే చెప్పాలి. అయితే సినిమాల్లో ఒక నటిగా రోజా ఎంతటి గుర్తింపు తెచ్చుకుందో, ఇక రాజకీయాల్లోనూ అంతకు మించిన పేరు తెచ్చుకుందని చెప్పాలి. అటువైపు సినిమాల్లో తనకు ఎదురెవరు లేరని నిరూపించుకున్న రోజా ప్రస్తుతానికి రాజకీయాల్లోనూ తనని ఢీకొట్టేవారెవరు లేరని నిరూపించుకుంది కూడా… ఒకప్పుడు రోజా రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది కానీ, ఇపుడు అదే ఐరెన్ లెగ్ కాస్త గోల్డెన్ లెగ్ గా మారి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిందని చెప్పాలి. కాగా అయితే రోజా మొదట్లో టీడీపీ పార్టీ లో చేరిపోయింది. కాగా ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి రోజా చేసినటువంటి కొన్ని వాఖ్యలు ఇప్పటికి కూడా చాలా ఘాటుగానే వినిపిస్తున్నాయని చెప్పాలి. కానీ ఆతరువాత రోజా కాంగ్రెస్ లోకి వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కూడా కొన్ని అనివార్యకారణాల వలన అది సాధ్యపడలేదు.

కాగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారి మరణం తరువాత జగన్మోహన్ రెడ్డి గారు స్తాపించినటువంటి వైసీపీ పార్టీ లో చేరిన రోజా ఇక అప్పటినుండి పార్టీలో చాలా కీలకంగా మారారని చెప్పొచ్చు… అయితే అప్పటినుండి ఇప్పటిదాకా కూడా రోజా దాటికి ఎదురెళ్లడానికి ఎవరు కూడా ముందడుగు వేయడం లేదనే చెప్పాలి. అయితే ఇక వైసీపీ లో చేరిన రోజా నగరి నియోజక వర్గం నుండి పోటీ చేసి వరుసగా రెండు సార్లు విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక రోజాకి మంత్రి పదవి వస్తుందని అందరు అనుకున్నప్పటికీ కూడా కొన్ని రాజకీయ సమీకరణాల వలన అది కుదరలేదు. ఇకపోతే ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రోజా కి ఎదురుగ పోటీ చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రోజని మాత్రం ఢీకొట్టలేకపోయాడనే చెప్పాలి. అయితే ఇప్పటికి కూడా రోజు ని ఎదుర్కునే నాయకులూ టీడీపీ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ లోను కూడా ఎవరు లేరని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.