కలకలం రేపుతోన్న ఆ మ్యాగజైన్ కవర్ ఫోటో!

Thursday, March 1st, 2018, 04:19:58 PM IST

ఇటీవల గృహలక్ష్మి అనే మ్యాగజైన్ కవర్ పేజ్‌పై పోస్ట్ చేసి సంచలనానికి తెరలేపారు ఆ మ్యాగజైన్ నిర్వాహకులు. ఈనెల 8వ తేదీన ప్రపంచ మళియాల దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రెస్ట్‌ఫీడ్ ఫ్రీలీ అనే ఓ క్యాంపెయిన్‌ ద్వారా ఇద్దరు మహిళలు బిడ్డకు బహిరంగంగా పాలిస్తున్న ఫొటోలను ఆ మ్యాగజైన్ ప్రచురించింది. కాగా ఆ ఇద్దరు మహిళల్లో ఒకరు మోడల్ అని తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే
అమృత అనే ఓ 23ఏళ్ల గృహిణి తన నెలన్నర బిడ్డకు పాలిస్తున్నఫొటోను ఆమె అంగీకారంతో ఆమె భర్త ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

అలా పోస్ట్ పెట్టిన వెంటనే ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఫొటో స్పూర్తితో గృహలక్ష్మి మ్యాగజైన్ ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది. అమృతతో గృహలక్ష్మి మ్యాగజైన్ మాట్లాడిన సందర్భంలో ఆమె చెప్పిన మాటలు కొంత చర్చకు దారితీశాయి. అమృత మాట్లాడుతూ నేను బిడ్డను కన్న తర్వాత ఆసుపత్రిలో ఉన్నప్పుడు బహిరంగంగా బిడ్డకు పాలిచ్చేటపుడు చాలామంది పక్కనున్న వారు ఆ శరీర భాగాన్ని కప్పుకోమని చెప్పేవారు. అదిమాత్రమేకాదు, అలా బహిరంగంగా బిడ్డకు పాలివ్వడం వల్ల పాలు పడటం తగ్గిపోతాయని అన్నారు.

వారి మూఢ విశ్వాసాలను ఇప్పటి యువతపై కూడా రుద్దాలని చూస్తున్నారు. మరికొందరైతే నేను బిడ్డకు పాలిస్తుండగా ఓ టవల్‌ను నాపై విసిరి కప్పుకోమనేవారు. అయితే నాకు నచ్చక ఆ టవల్‌ను నేను తీసేయడానికి ప్రయత్నించాను అని చెప్పారు. అయితే గాయత్రి మ్యాగజైన్ కవర్ ఫొటోకు ఫోజిచ్చిన రచయిత్రి, నటి, మోడల్ అయినా గిలు జోసెఫ్ మాట్లాడుతూ ఎవరైతే బిడ్డకు బహిరంగంగా పాలివ్వడం గర్వ కారణంగా భావిస్తారో అలాంటి వారందరికీ తన ఫొటోను అంకితం ఇస్తున్నానన్నారు.

కాగా ఈ ఫొటోలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తీవ్రంగా విమర్శిస్తుంటే మరికొందరేమో బిడ్డకు పాలివ్వడం తప్పు కాదని, అయితే స్త్రీ శరీరంలోని ఓ భాగాన్ని బహిరంగంగా చూపించడం తప్పని అంటున్నారు. అయితే పాలు తాగే బిడ్డను చూడకుండా, ఆ తల్లి శరీరం లోని ఆ భాగం వంక చూసే సంకుచిత మనస్తత్వాన్ని ఇకనైనా వీడాలని క్యాంపెయిన్ నిర్వాహకులు అంటున్నారు.