ఆ సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ తగ్గింది : దిల్ రాజు

Tuesday, April 10th, 2018, 07:34:35 PM IST


నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం మంచి విజయాలతో దూసుకుపోతున్నారు. లేటెస్ట్ మూవీ ఎంసీఏ తర్వాత ప్రస్తుతం విడుదలవుతున్న ఆయన కొత్త సినిమా కృష్ణార్జున యుద్ధం. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో అనుపమ పరవేుశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్స్. మేర్లపాక గాంధీ దర్శకుడు. వెంకట్ బోయినపల్లి సమ‌ర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలవుతుంది.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో దిల్ రాజు ఈ సినిమా గురించి ముందే రివ్యూ చెప్పేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

దిల్‌రాజు మాట్లాడుతూ, కృష్ణార్జున యుద్ధం చిత్రాన్ని మాకు రిలీజ్ చూసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. దర్శకుడు మేర్లపాక గాంధీ నాకు ముందే పరిచయం. సింపుల్ క్యారెక్టరైజేషన్‌తో మంచి ఎంటర్టెన్మెంట్ చేస్తూ తొలి చిత్రం వేంకటాద్రి ఎక్స్ప్రెస్ సూపర్ హిట్ చేశాడు. అన్నారు. గాంధీలో నేను గమనించిన విషయం క్యారెక్టరైజేషన్స్, ఎంటర్టెన్మెంట్, మ్యూజిక్ ప్యాకేజ్ చేసి పెద్ద స్ట్రెయిన్ తీసుకోకుండా ఆడియన్స్‌‌ను ఎంటర్టెన్ చేస్తున్నాడు. ఇపుడు కృష్ణార్జున యుద్ధం, నేను నాని కలిసి మూడు రోజుల క్రితం చూశాం. సింపుల్‌గా కృష్ణ, అర్జున్ క్యారెక్టరైజేషన్స్ రాసుకుని నాన్ స్టాప్ ఎంటర్టెన్ చేస్తూ ఒక చిన్న కథను రన్ చేస్తూ మళ్లీ ప్రేక్షకుల ఈ సమ్మర్ సీజన్లో మంచి వినోదం అందించబోతున్నాడు అని దిల్ రాజు తెలిపారు.

ఫస్టాఫ్ హిలేరియస్ ఎంటర్టెన్మెంటుతో ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇక సెకండాఫ్‌లో కథలోకి వచ్చినపుడు ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కొంత ఎంటర్టెన్మెంట్ తగ్గినా సినిమా చూసి బయటకు వచ్చేపుడు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా ఎలా ఫీలయ్యానో ఈ సినిమాకు అలాగే ఫీలయ్యాను అన్నారు. ఈ సినిమా ద్వారా గాంధీ హాట్రిక్ కంప్లీట్ చేయబోతున్నాడు అని దిల్ రాజు అన్నారు. నాని మాట్లాడుతూ, నా ప్రతి సినిమా విడుద‌ల‌కు ముందు టెన్షన్ ఉంటుంది. ఎక్కువ సినిమాలు చేస్తే టెన్షన్ అలవాటు పడిపోతుందని అనుకుంటే.. ప్రతి సినిమాకు టెన్షన్ కామ‌న్‌గా వస్తూనే ఉంది. ఇపుడు కృష్ణార్జున యుద్ధం రెండు రోజులు ముందు చూశాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని తెలిపారు. ఎప్పుడు చెప్పే మాటే అయినప్పటికీ, మళ్లి చెపుతున్నానని, దయచేసి పైరసీని ఎంకరేజి చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేసారు…..