ఆ నెంబర్ పవన్ కి ఆయన ఫ్యాన్ కి కలిసిరాదు : కత్తి మహేష్

Thursday, April 5th, 2018, 06:21:38 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల విడుదలయిన చిత్రం అజ్ఞాతవాసి. ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన ఈ చిత్రం టాలీవుడ్ లోనే అతిపెద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అది పవన్ త్రివిక్రమ్ కంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడం, అందునా పవన్ కు ప్రతిష్టాత్మక 25వ చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయికి వెళ్లాయి. అయితే నేడు ఆయన అభిమాని అయిన నితిన్ నటించిన 25వ చిత్రం చల్ మోహన రంగ విడుదలయింది.

ఈ చిత్రం పై కత్తి మహేష్ సంచలన ట్వీట్ చేశారు. 25 అనే నంబర్ పవన్ కల్యాణ్‌కి, ఆయన ఫ్యాన్ నితిన్‌కి కూడా కలిసొచ్చేలా లేదు. నేను ఇలాంటివి నమ్మనుగాని, రాబోయే ఎన్నికల్లో జనసేనకి వేరే పార్టీవాళ్లు కూడా అంతే సీట్ షేరింగ్ కేటాయింపులు చేస్తే ఇంకా బాగుంటుందేమో! అంటూ ట్వీట్ చేశారు. అంతకు ముందు ఛల్ మోహన్ రంగకు రివ్యూ తన ట్విట్టర్ ద్వారా రివ్యూ ఇచ్చారు కత్తి. ‘‘ఛల్ మోహన్ రంగ కొద్దిగా లవ్ స్టోరీ, దీనికి ర్యాండమ్‌గా కొంచెం ఫన్ యాడ్ చేశారు. నితిన్ బాగా నటించాడు. మేఘన నటన సింపుల్‌గా ఉంది. ఈ లవ్ స్టోరీ వేరే ఏ లవ్ స్టోరీని పోలి ఉండదు. కొద్దిగా నవ్వుకోవచ్చు. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్‌గా ఉంది. థమన్ మ్యూజిక్ జస్ట్ ఓకే. ట్రై యువర్ లక్’’ అంటూ తన రివ్యూలో పేర్కొన్నారు కత్తి మహేష్….

  •  
  •  
  •  
  •  

Comments