బుల్లితెరపై రికార్డు స్థాయిలో టీఆర్పీ తెచ్చుకున్న కొత్త సీరియల్!

Friday, September 28th, 2018, 04:51:00 PM IST

గడుస్తున్న రోజుల్లో గ్రామం పట్టణం అని తేడా లేకుండా ప్రతీ ఒక్క మహిళా ఆదరించేది బుల్లితెరపై వచ్చే ధారావాహికలే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మన ఇళ్లల్లోని మహిళలని రెప్ప కూడా వాల్చనీయకుండా చేస్తాయి అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.ఒక్కో ఛానెల్లో ఒక్కో ధారావాహికది దేనికదే ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి.ఆ ధారావాహిక కాస్త బాగుంది అంటే చాలు మన మహిళలు నెత్తిన పెట్టుకుంటారు.అంతెందుకు ఇప్పుడు రోజుల్లో భార్యాభర్తలు కూడా కలిసే వీటిని వీక్షిస్తున్నారు.

బుల్లితెరపై 2000 రోజులకు పైగా ప్రచారం అయినవి కూడా ఉన్నాయి,కానీ ఇప్పుడున్న రోజుల్లో మాత్రం టీఆర్పీ ఆధారంగా ఏ సీరియల్ ను ఎంతలా ఆరాధిస్తున్నారో చెప్తున్నారు.ఈ టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ లో ఇటీవలే మొదలయ్యిన కొత్త సీరియల్ మొదలయిన వారంలోనే ఏ సీరియల్ కి రాని విధంగా రేటింగ్స్ సంపాదించుకుంది.ఇటీవలే మా టీవీ ఛానెల్లో “మౌన రాగం”అనే సీరియల్ మొదలయ్యింది..తనకి కూతురు వద్దు కొడుకు మాత్రమే కావాలని కోరుకునే తండ్రికి ఒక కూతురు పుడుతుంది అందులోను ఆమె మాటలు రాని అమ్మాయిగా పుడుతుంది,దీనితో ఆమెకు తన తండ్రి నుంచి ఎదురైన చేదు సంఘటనలు నుంచి ఆమె ఎలా నిలదొక్కుకుంటుంది ఇతర అంశాల మీద తెలుగు ప్రేక్షకులు ఈ సీరియల్ కి బ్రహ్మరథం పడుతున్నారు.ప్రతీ రోజు రాత్రి 8:30 నిమిసాలకు ఈ సీరియల్ ప్రచారం అవుతుంది.ఆ సమయంలో వచ్చిన ఏ సీరియల్ కి రాని విధంగా ఈ సీరియల్ కు మొదటి వారంలో 8.6 టీఆర్పీ రేటింగ్స్ ను సొంతం చేసుకుంది.బుల్లి తెరపై ఇది ఒక రికార్డే అని చెప్పాలి.