భారీ బ్లాక్ మనీ చిక్కుల్లో…ఆ స్టార్ హీరో?

Thursday, November 24th, 2016, 11:17:30 PM IST

mohan-lal
లేటెస్ట్ గా ”జనతా గ్యారేజ్” సినిమాలో నటించి ఆకట్టుకున్న మోహన్ లాల్ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డాడు. దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కుదిపేస్తోంది, ఇప్పటికే నానా హంగామా సాగుతుండగా .. కొందరు మోడీకి జేజేలు కొడితే .. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక మలాయల స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాని మోడీ చేసిన పనికి మెచ్చుకున్నాడు. సినిమా థియేటర్స్, మద్యం షాపులు, ప్రార్థన స్థలం దగ్గర క్యూ లో నిలబడతాం .. అలాంటిది దేశానికి మంచి జరిగే విషయంలో ఎందుకు ఫైర్ అవుతున్నారు అంటూ కామెంట్స్ చేసాడు? దాంతో ఆయనపై విరుచుకు పడుతున్నారు జనాలు. మోహన్ లాల్ పై గతంలో అవినీతి ఆరోపణలు, ఐటి దాడుల విషయాన్నీ జనం బయటికి తీస్తున్నారు. అవన్నీ ఓకే అనుకుంటే .. ఇప్పుడు ఓ పెద్ద స్కాం బయట పడింది .. పెద్ద నోట్ల రద్దు విషయం ముందే తెలిసిన మోహన్ లాల్ అంతకు ముందే .. 3,300 కోట్ల రూపాయలను కువైట్ లోని ఓ మైనింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం? ఈ విషయం పై కువైట్ లోకూడా బ్లాక్ మనీ అంటూ మీడియా ప్రచారం చేసింది!! ఈ విషయం గురించి మోహన్ లాల్ ఏమంటారు అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు? మొత్తానికి మోహన్ లాల్ విషయం ఇప్పుడు సంచలనం రేపెలా ఉంది!! మరి ఈ విషయం పై అయన ఏమంటారో చూడాలి.