అమ్మడు హావభావాలకి ఆ స్టార్ ఫిదా!

Wednesday, February 14th, 2018, 01:30:19 AM IST

ప్రియ ప్రకాశ్‌ వరియర్‌. ఈ మలయాళీ భామ తన చూపుతో యువకుల గుండెల్ని పిండేస్తోంది. ఇప్పుడు ప్రియ సోషల్‌మీడియాలో స్టార్‌ అయిపోయింది. ప్రియ పలికించిన హావభావాలు యూట్యూబ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఇలా అన్ని సామాజిక అనుసంధాన వేదికలలో ఆమె పేరును నెటిజన్లు జపిస్తున్నారు. ఇక యూట్యూబ్‌లో అయితే రెండు రోజుల నుంచి మొదటి స్థానంలో ట్రెండ్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. ఊహించని రీతిలో వస్తున్న ఈ స్పందనకు ప్రియ అమితోత్సాఅహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కథానాయికగా నటిస్తున్న ‘ఒరు అదర్‌ లవ్‌’ చిత్రంలోని ‘మణిక్య మలరాయ’ అనే పాటలో ఆమె కళ్లతో పలికించిన హావభావాలు పర్లికించిన తీరుకి ఫిదా కానీ వారు లేరు. ఇప్పటికే ఈ వీడియోను 45 లక్షల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది.

అయితే కేవలం 27 సెకన్లలోనే సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించిన ప్రియకు మన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఫిదా అయిపోయాడు. బన్నీ ఈ వీడియోను స్వయంగా తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఈ మధ్యకాలంలో నేను చూసిన క్యూట్‌ వీడియోల్లో ఇదొకటి. ది పవర్‌ ఆఫ్‌ సింప్లిసిటీ ఐ లవ్‌ ఇట్‌’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. బన్నీ వంటి పెద్ద స్టార్ కు కూడా ఈ పిల్ల నచ్చేసిందంటే మరి ఈ అమ్మడు త్వరలో తెలుగులో తెరంగేట్రం చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదని, పైగా మలయాళం భామలకు మన టాలీవుడ్ లో యమా క్రేజ్ ఉందనే ఉందిని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రియ త్రిస్సూర్‌లో డిగ్రీ చదువుతూ శాస్త్రీయ నృత్యం మోహినిఆట్టంలోనూ శిక్షణ తీసుకుంతున్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments