సాయి ధరమ్ చిత్రం టైటిల్ గా ఆ హిట్ పాట ?

Sunday, March 11th, 2018, 11:03:14 PM IST

ప్రస్తుతం వరుస పరాజయాలతో చాలా వరకు డీలాపడ్డ మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరం తేజ్ ప్రస్తుతం కెరీర్ ని మరింత పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక చిత్రం షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ‘సిక్స్ టీన్స్’ చిత్రంలోని ‘దేవుడు వరమందిస్తే’ అంటూ సాగే హిట్ పాట వుంది. అయితే ఆ పాట పల్లవి నే ఈ చిత్ర టైటిల్ గా ఫిక్స్ చేశారని తెలుస్తోంది.ఈ చిత్రాన్ని కె.ఎస్.రామారావు ఆయన బ్యానర్ క్రియేటివ్ కమర్షియల్స్ పై నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఫిలింఛాంబర్లో వారి బ్యానర్ పై దేవుడు వరమందిస్తే అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. కాగా అది తేజు చిత్రానికి నిర్ణియిచ్చినా టైటిల్ అని తెలుస్తోంది. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న సాయి ధరంతేజ్, కరుణాకరన్ కలిసి చేస్తున్న చిత్రం కాబట్టి దీనిపై వాళ్ళిద్దరూ చాలానే ఆశలు పెట్టుకున్నారు.ఇది ఒక ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్నట్లు సమాచారం. తేజు సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే జులైలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది…