బిగ్ బ్రేకింగ్ : ఇక టీడీపీ పనైపోయినట్టే..ఆ పెద్ద తల కూడా వైసీపీలోకే.!

Thursday, July 18th, 2019, 10:30:40 AM IST

2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.కేవలం 23 మంది ఎమ్మెల్యేలు అలాగే ముగ్గురు ఎంపీలు మాత్రమే వారు పరిమితం కావడం కోలుకోలేని దెబ్బ అయితే ఆ తర్వాత ఆ ఉన్న కాస్త మంది కూడా ఉంటారా ఉండరా అన్న పరిస్థితి నెలకొంది.అందులో భాగంగా గత కొంత కాలం నుంచి ఇదే తెలుగుదేశం పార్టీకు చెందిన ఎంపీ అయినటువంటి కేశినేని నానికు మరియు ఆ పార్టీకు దూరం పెరుగుతూ వస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఇప్పుడు ఆ దూరం మరింత పెరిగి వైసీపీకు దగ్గరవుతోందా అంటే అవుననే చెప్పాలి.

అంతే కాకుండా ఇన్ని రోజులు ఊహాగానాలు వచ్చినా సరే నాని మాత్రం తెలుగుదేశం పార్టీకి చేరిపోయేందుకు అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పుడు కొన్ని సాక్ష్యాలు బయటకొచ్చాయి.తాజాగా కేశినేని నాని మరియు వైసీపీకి చెందిన నేతలు సహా ఆ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజులు కలిసి నవ్వుతు దిగిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది.దీనితో ఇక నాని వైసీపీలో చేరేందుకు తలుపులు తెరుచుకున్నాయని ఇక ఉన్నదే ముగ్గురు ఎంపీలు అయితే ఈ మూడు కాస్త రెండు అయ్యిపోతుందని ఇక రానున్న రోజుల్లో టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు.