ఆ ట్వీట్లు నేను చేసినవి కావు : యాంకర్ రవి

Thursday, April 26th, 2018, 09:31:48 AM IST

ఇటీవల గత కొద్దిరోజులుగా బుల్లితెర యాంకర్ రవి పేరిట సోషమ్ మీడియా మాధ్యమం అయినా ట్విట్టర్ లో మీడియా ను అదేపనిగా అసభ్య పదజాలంతో దూషిస్తూ పలు ట్వీట్లు, అసభ్యకర పోస్ట్లు దర్శనమిస్తున్నాయి. ఇవి ట్విటర్ లో తెగ హల్ చల్ చేస్తుండడంతో మొత్తానికి విషయం యాంకర్ రవిని చేరడంతో, అతను ఈ విషయమై తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఒక వీడియో విడుదల చేసి వివరణ ఇచ్చుకున్నాడు.

నిజానికి అది తన ట్విట్టర్ ఖాతా కాదని, కావాలని ఎవరో సృష్టించిన మాయాజాలం అని, దయచేసి ఎవరు ఈ విషయమై తనని తప్పుపట్టవద్దని అన్నాడు. తనపేరుతో అటువంటి నీచమైన పనులకుతెగబడిన వారిని వదిలిపెట్టేది లేదని, వారిపై పోలీస్ లకు కంప్లైంట్ చేస్తానని ఆయన అన్నాడు. నిజానికి తాను కొన్నాళ్లుగా ట్విట్టర్ లో యాక్టివ్ గా లేనని, కేవలం పేస్ బుక్ మాత్రమే వాడుతున్నానని, అలానే తన అధికారిక ట్విట్టర్ ఖాతా వివరాలను కూడా తెలియచేసాడు రవి….

  •  
  •  
  •  
  •  

Comments