నా అసలు పేరు అది కాదు : కైరా అద్వానీ

Sunday, April 29th, 2018, 04:14:53 PM IST

తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి అద్భుతమైన యాక్టర్ సరసన రావటం తన లైఫ్ టైం ఎచీవ్మెంట్ గా ఫీల్ అవుతోందట కైరా. బాలీవుడ్ లో తొలి చిత్రం ఫుగ్లీ తో అక్కడ అడుగుపెట్టిన ఈ అమ్మడు భరత్ అనే నేను సక్సెస్ సందర్భంగా మీడియాతో తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. నిజానికి తాను ఫుగ్లీ లో మొదట నటించానని అందరూ అనుకుంటారని కానీ తాను చిన్నపుడు తొమ్మిది నెలల వయసులోనే ప్రముఖ సంస్థ విప్రో యాడ్ లో నటించినట్లు చెప్పింది. అంతే కాదు, సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులు వేసిన బాటలో పయనిస్తూ ఉంటారు. కానీ, కైరా అడ్వాణీ మాత్రం తన తాతల స్ఫూర్తితో సినిమా రంగంలో అడుగుపెట్టింది.

సినీరంగంతో కైరాది మూడు తరాల అనుబంధం. ఆమె తాతయ్య హమీద్‌ జాఫ్రీ అలనాటి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సయీద్‌ జాఫ్రీకి స్వయానా తమ్ముడు. చిన్న అమ్మమ్మ ప్రముఖ హిందీ నటుడు అశోక్‌ కుమార్‌ పెద్ద కుమార్తె అట. తాను పుట్టింది, పెరిగింది ముంబైలోనే, చిన్నప్పటి నుండి నటన మీద తనకు ఎక్కువ ఆసక్తి ఉండేదట, అయితే తాను మాత్రం డిగ్రీ మాస్ కమ్యూనికేషన్స్ విభాగంలో పూర్తి చేసిందట. ఆ తర్వాత నటనమీద మక్కువతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. నిజానికి తన అసలు పేరు అలియా అద్వానీ అట. అయితే తన తొలి చిత్రం ఫుగ్లీ షూటింగ్ జరుగుతున్నపుడు ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన హీరో సల్మాన్ ఖాన్, ఇప్పటికే షూటింగ్లో ఒకహీరోయిన్ అలియా పేరుతో ఉందని ఆలోచించి తన పేరు ముందు కైరా ను చేర్చారట.

తనకు షాపింగ్ అంటే చెప్పలేనంత పిచ్చి అట. రకరకాల డ్రస్సులతో సహా కనిపించిన ప్రతి వస్తువు కొంటుంటుందట. అందుకే వాళ్ళ అమ్మ ఆమె షాపింగ్ కి బయల్దేరినపుడల్లా, ఖాళి పర్సు, డబ్బుల్లేని ఏటీఎం కార్డులు ఇస్తుందట. కానీ ఇప్పటికీ టాలీవుడ్ లో ఒక సూపర్ స్టార్ పక్కన నటించాను అంటే నమ్మలేకుండా వున్నాను అని, మహేష్ బాబు బయట ఎక్కడ కనపడినా చాలా నార్మల్ పర్సన్ లాగ మాట్లాడుతారని, ఏమి ఏమేమి లేటెస్ట్ సినిమాలు చూసావ్ అని ఎప్పుడు సినిమాల గురించి అడుగుతుంటారని తన గురించి చెప్పుకొచ్చింది మన వసుమతి అదేనండి కైరా అద్వానీ……..

  •  
  •  
  •  
  •  

Comments