కింగ్ ఖాన్ చిత్రానికి కథ రాస్తున్న ఆ కథకుడు ?

Monday, January 29th, 2018, 03:58:36 PM IST

షారుఖ్ ఖాన్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు సరైన సక్సెస్ సాదించడంలేదనేది ఒప్పుకోవాల్సిన నిజం. ఒక ప్రక్క సల్మాన్, టైగర్ జిందా హాయ్ చిత్రం కొత్త రికార్డ్స్ నెలకొల్పుతోంది. మరొక వైపు అమిర్ నటించిన దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రాలు కూడా భర్తీ కలెక్షన్లు సాధించాయి. అయితే షారుఖ్ కి మాత్రం ఆ స్థాయి విజయం అందడంలేదు. ప్రస్తుతం ఆయన ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం లో జీరో చిత్రం చేస్తున్నారు. ఇందులో ఆయన మరుగుజ్జు పాత్ర చేస్తున్నారు. తన తదుపరి చిత్రానికి సంబంధించి ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ షారుఖ్ కు ఒక కథ చెప్పినట్లు దానిపట్ల ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది. ఇదివరకు సల్మాన్ కు భజరంగీ భాయీ జాన్ వంటి మంచి విజయానికి కథ అందించింది విజయేంద్రప్రసాద్ అనేది తెలిసిన విషయమే.

ఈ కథ విషయమై హైదరాబాద్ నుండి ముంబై వెళ్లి అక్కడ షారుఖ్ ని కలిసి ఆయనకి మంచి రివెంజ్ డ్రామా కు సంబందించిన ఒక కథని వినిపించారని అది ఆయనను బాగా ఎగ్జైట్ చేసి పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేసుకుని వస్తే వీలైనంత త్వరగా సినిమా చేద్దామని షారుఖ్ అన్నారని తెలియవస్తోంది. రాజమౌళి వరుసగా సాధిస్తున్న విజయాల్లో కీలకపాత్ర విజయేంద్రప్రసాద్ అని చెప్పవచ్చు, ఇప్పటివరకు ఆయన అందించిన కథల్లో బాహుబలి యూనివెర్సల్గా సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. మరి ఆయన అలాంటి కథ ఏదైనా చెప్పారా లేక, సోషల్ కథాంశం ఏదైనా చెప్పారా అనేది తెలియాల్సి వుంది. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు గాని ఈ వార్త ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. సమర సింహారెడ్డి చిత్రానికి కథ రాసినప్పటినుండి హీరో లను మంచి మాస్ గా చూపించే ఆయన హీరో క్యారెక్టర్లు బాగా ప్రేక్షకాదరణ పొందినవే. దర్శకుడిగా రాజన్న, శ్రీవల్లి వంటి చిత్రాలకు దర్శకత్వం చేసిన ఆయన మంచి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం కాక రాజమౌళి దర్శకత్వం లో రాంచరణ్, యన్ టి ఆర్ ల మల్టీస్టారర్ కి కథ సిద్ధం చేసే పనిలో నిమగ్నమయినట్లు తెలుస్తోంది. ప్రక్క మాస్ కమర్షియల్ కాథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు అక్టోబర్ లో ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతోంది…..