అందువల్లనే ‘అజ్ఞాతవాసి’ ప్లాప్ అయింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

Sunday, May 27th, 2018, 07:34:45 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన చిత్రం అజ్ఞాతవాసి. గత సంక్రాంతికి ఎన్నో ఆశలు, అంచనాల మధ్య విడుదలయిన ఈ చిత్రం అనూహ్యంగా ఘోర పరాజయం పాలవడంతో చిత్ర యూనిట్ మొత్తం ఢీలా పడ్డామని ఆయన ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. నిజానికి తాను ఈ కథను ఒక రాజు, ఒక రాజ్యం అనే తరహాలో చెప్పకుండా కార్పొరేట్ నేపథ్యంలో బిజినెస్ పేజీకి మాత్రమే పరిమితమయ్యే న్యూస్ ఐటం లాంటి ఒక కథను తీసుకోవడమే పెద్ద తప్పు అని తనకు తర్వాత తెలిసిందని అన్నారు. అయితే అప్పటికే జరగవలసిందంతా అయిపోయిందని, చిత్రాన్ని దాదాపు రూ.90 కోట్లకు బయ్యర్లు కొనుగోలు చేస్తే అందులో దాదాపు రూ.60 కోట్లు మాత్రమే వారికి తిరిగివచ్చింది. కాగా మమ్మల్ని ఎంతో నమ్మి చిత్రాన్ని కొనుగోలు చేసిన వారికి ఏ మాత్రం నష్టం రాకూడదని భావించి నేను, కళ్యాణ్ గారు, నిర్మాత రాధా కృష్ణ గారు కలిసి రూ.25 కోట్లవరకు వెనక్కు ఇచ్చేశామని అన్నారు.

అయితే ఆ చిత్ర పరాజయం తనకు మరిచిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చిందని అన్నారు. 2014 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారికి ‘కోబలి’ కథ చెప్పానని, ఆయన ఆ సమయంలో ఎన్నికల హడావిడిలో ఉండడంవల్ల దాన్ని తెరకెక్కించలేకపోయామని, అయితే దానినుండి నేను స్ఫూర్తి పొందిన కొన్ని మెళకువలను ప్రస్తుతం ఎన్టీఆర్ చిత్రంలో చూపించబోతున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ తో చేసే చిత్రం అందరిని అలరిస్తుందని నమ్ముతామున్నాను అన్నారు. అంతే కాదు ఇకపై తన నుండి వచ్చే చిత్రాలు ప్రేక్షకులను తప్పక అలరించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు….

  •  
  •  
  •  
  •  

Comments