మహిళ పై అత్యాచారం – తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి

Thursday, February 13th, 2020, 01:55:23 AM IST

మనం బ్రతుకుతున్న పరిస్థితుల్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలకు రక్షణగా ఉండేందుకు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ మానవ మృగాలు మాత్రం మారినట్లు కనీసం మచ్చుకు కూడా కనిపించడం లేదనే చెప్పాలి. ఒకవైపు చట్టాలు నిందితుల చుట్టూ ఉరిలా ఉచ్చు బిగుస్తున్నప్పటికీ కూడా నిర్భయంగా ఏ మానవ మృగాలు తమ పని తాము చేసుకుంటూ, మేము ఎవరికీ భయపడేది లేదని గర్వంగా గళ్ళ ఎగరేసుకొని మరీ తిరుగుతున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం జహీరాబాద్ పరిసరప్రాంతాల్లో, ఒక బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై నలుగురు మృగాలు తాము పోలీసులమని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.

కాగా ఆ ఘటన నుండి తేరుకున్న సదరు మహిళ తనకు జరిగిన అన్యాయంపై జహీరాబాద్ లోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను పట్టుకునేందుకు తమ వేటను ప్రారంభించారు. కాగా సీసీ కెమెరాల ఆధారంగా ఆ నిందితులను పోలీసులు గుర్తించారు. కాగా వారిని పట్టుకునే క్రమంలో, ఆ నిందితులు కారులో పారిపోడానికి ప్రయత్నించారు. కాగా ఆ నిందితులు పారిపోతున్న ఆ కారు మితిమీరిన వేగంతో అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. కాగా ఈ ప్రమాదంలో ఒక నిందితుడు అక్కడికక్కడే మరణించగా, మరణించగా మిగిలిన వారు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతానికి వారు జహీరాబాద్ లోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.