మద్యపాన నిషేధంపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Saturday, August 17th, 2019, 02:34:01 AM IST

ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తొందర్లోనే ఏపీలో మద్యపాన నిషేధాన్ని చేస్తామని అధికారికంగానే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కాగా ఈమేరకు ఏపీ ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి మరీ మద్యం దుకాణాలను నిర్వహించబోతుంది. ఈమేరకు దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఎక్సైజ్‌శాఖకు వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి మద్యం షాపులకంటే కూడా 1000 షాపులను కొల్లగొట్టనుంది. కాగా మండలాలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలోనే షాపులను నిర్వహించాలని, ప్రతి 300 అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఒక్కో మద్యం షాపు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే బేవరేజెస్ కార్పొరేషన్ ప్రతీ మద్యం దుకాణంలో సీసీ కెమెరాలు, తెలుగు, ఇంగ్లీషుల్లో నెంబర్ బోర్డులు వేయించడానికి సిద్దమయింది. కాగా ఈ షాపుల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగుల నియామకం చేపట్టనున్నారు. వారికి సంబందించిన విద్యార్హతతోనే వారికి ఈ మద్యం షాపుల్లో ఉపాధి కల్పించనున్నారు. అయితే ఎవరైనా కూడా ఈ విధానాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయని ముందుగానే వైసీపీ ప్రభుత్వం హెచ్చరికలు జరీ చేస్తుంది.