‘చేనేత’ సమస్యలపై కేంద్రం హామీ

Saturday, September 27th, 2014, 01:58:39 AM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మంత్రి రవీంద్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు టెక్స్ టైల్ పార్కులు, మెగా క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో వందకు పైగా బీసీ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదనలు కోరిందని రవీంద్ర మీడియాకు తెలియజేశారు. కృష్ణా జిల్లాలో మంచినీటి సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. మంచినీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.