కేంద్ర ఆరోగ్య శాఖ కీలక హెచ్చరిక – లాక్‌డౌన్‌ లో అవి వద్దు…

Wednesday, April 1st, 2020, 05:06:21 PM IST

మనదేశంలోమహమ్మారి కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో దేశ ప్రజలందరు కూడా వారి ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఇలా ఇళ్లల్లో ఖాళీగా ఉన్నవారందరూ కూడా తమ పనులల్లో మునిగిపోతుంటే, కొందరు మాత్రం అతిగా మద్యం సేవించడం, సిగరెట్ కాల్చడం చేస్తున్నారు. ఆలా చేయడం వలన కరోనా ని బొట్టు పెట్టి పిలిచినట్లు అవుతుందని కేంద్ర వైద్యారోగాధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇలా చేయడం వలన కొంత మానసిక ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపిస్తుందని, అది చాలా ప్రమాదమని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

ఎందుకంటే ఇలా చేయడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని, ఆ సమయంలో ఎక్కువగా రోగాలు వ్యాపిస్తాయని చెబుతున్నారు.అందుకనే ఆ రెండింటికి కూడా వీలైనంత దూరంలో ఉండాలని, పూర్తిగా మానేయాలని అంటున్నారు. ఇకపోతే కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చర్యలను తీసుకుంటున్న తరుణంలో కొందరు ఆకతాయిలు మాత్రం అదేపనిగా బయట తిరగడం, అందరితో సన్నిహితంగా ఉండటం వలన ఈ వైరస్ ఎక్కువవుతుంది, అందుకనే వీలైనంత సామాజిక దూరాన్ని పాటించాలని కేంద్ర, రాష్ట్ర వైద్యారోగ్యాధికారులు పలు హెచ్చరికలు చేస్తున్నారు.