ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి – మాజీ ఎంపీ

Thursday, July 18th, 2019, 02:34:06 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని సొంతం చేసుకున్నప్పటినుండి కూడా తన పాలనలో అందరికి సమన్యాయం చేసుకుంటూ వెళ్తున్నాడు. జగన్ తీసుకునే నిర్ణయాలు కొందరికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కూడా చాలా వరకు జగన్ తీసుకునే నిర్ణయాలు అన్ని ప్రజా సంక్షేమంకోసమే అని అందరు అంటున్నారు. కాగా ఏపీ సీఎం జగన్ పాలనకు మెచ్చిన మాజో ఎంపీ జగన్ ని తన ప్రశంశలతో ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇలాగె ఉండాలని, ప్రజలమీద ప్రేమతో ఇలా ప్రజలకు అవసరమయ్యే పనులన్నింటిని చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అయితే ఈమేరకు మాట్లాడిన ఉండవల్లి… “అర్ధాంతరంగా రాష్ట్రం విడిపోవడంతో, రాజకీయాల్లో అంత అనుభవజ్ఞుడు అవ్వడంతో ప్రజలు చంద్రబాబు నాయుడు ని గెలిపించారు. కానీ చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రానికి ఎం చేయలేదని, అందుకనే ఈసారి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి అధికారాన్ని అప్పగించారని, కానీ అధికారాన్ని అందుకున్న జగన్ తన తండ్రి మాదిరిగానే ప్రజలందరి బాగోగులు చేసుకుంటున్నాడని ఉండవల్లి అవాఖ్యానించారు.

అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటిని కూడా ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నారని, రాష్ట్రంలో అవినీతి అంతం చేయడమే లక్ష్యంగా జగన్ పని చేస్తున్నారని ఉండవల్లి అన్నారు. అయితే వారి తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో అని ప్రతిపక్ష నేతలు అధికార పార్టీ పై నిత్యం విరుచుకపడుతున్నారని, ఇది కేవలం ప్రజలని తప్పు దారి పట్టించేందుకే అని ఉండవల్లి వాఖ్యానించారు. కానీ ఈ ముఖ్యమంత్రి పదవి అనేది జగన్ కి ఒక సవాల్ లాంటిదని, తానూ ఈ పదవిలో ఉంది ఏదైనా తప్పు చేస్తే తన తండ్రికి చెడ్డపేరు వస్తుందని, అది గమనించి జాగ్రత్తగా ఉండాలని ఉండవల్లి సూచించారు.