రేపటి నుండి రంగంలోకి దిగనున్న ఎన్టీఆర్

Thursday, April 12th, 2018, 12:33:28 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో తెర‌కెక్క‌నున్న క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని చాలా రోజులు అయింది. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌స్తున్నారు. అయితే కొద్ది సేప‌టి క్రితం తార‌క్ పీఆర్ మ‌హేష్ కోనేరు త‌న ట్విట్ట‌ర్‌లో రేప‌టి నుండి మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలియ‌జేశారు. త్రివిక్ర‌మ్ అదిరిపోయే స్క్రిప్ట్ సిద్ధం చేశారు. తార‌క్ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌నున్నారు. ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక‌వ్వ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న అన్నారు. ఏప్రిల్ 13 నుండి 25 వర‌కు హైదరాబాద్ లోనే తొలి షెడ్యూల్ చిత్రీకరించనున్నారని స‌మాచారం. ఈ షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించనున్నారని టాక్‌. ఇంతక ముందు సినిమాలకంటే భిన్నంగా ఈ సినిమాలో రామ్ లక్ష్మణ్ లు యాక్షన్ ఎపిసోడ్ డిజైన్ చేశారని టాక్. థమన్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై రూపొందనుంది. కొద్ది రోజులుగా ప్ర‌ముఖ హాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వ‌ర్యంలో ఎన్టీఆర్‌ భారీ వ‌ర్క‌వుట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.