ముఖ్యమంత్రి పై పగపట్టిన కాకి..!

Saturday, January 21st, 2017, 12:50:49 AM IST

karnataka-cm-siddaramaiah
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యకు కాకుల బెడద వదిలేలా లేదు.రాష్ట్రం దాటి వెళ్లినా ఆయనను కాకులు వదలడం లేదు. గురువారం ఆయన కేరళ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. వేదిక పై కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రసంగిస్తున్నారు. వేదికపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య తో పాటు పలువురు ప్రముఖులు కూర్చుని ఉన్నారు. ఈ సమయంలో కొన్ని కాకులు అరవడం మొదలుపెట్టాయి.అక్కడున్న వారు ఎంత ప్రయత్నించినా అవి వెళ్ళలేదు. ఓ కాకి సిద్ద రామయ్య పంచె పై రెట్ట వేసింది. ఆయన పక్కనే కూర్చొని ఉన్న మంగుళూరు ఎమ్మెల్యే మొహిద్దీన్ వెంటనే టిష్యు పేపర్ తో ముఖ్యమంత్రి పంచెని శుభ్రం చేశారు.

కాకుల బెడద సిద్ధరామయ్యకు ఇప్పుడే కాదు గతం లోను ఎదురైంది. గత జూన్ లో సిద్ద రామయ్య కారు బెనెట్ పై కాకి వాలింది. కారు 3 కిమీ దూరం ప్రయాణించినా కాకి వెళ్లలేదు.దీనితో అశుభం అని భావించిన ముఖ్యమంత్రి వెంటనే కారుని మార్చేశారు.ఈ కర్ణాటక లో పెద్ద చర్చనీయంశంగా మారింది. ఆయన కుమారుడి మరణం తరువాత ఆయన చేతిలో నిమ్మకాయ పట్టుకుని తిరిగారు. ఇది కూడా వివాదంగా మారింది. ముఖ్యమంత్రి మూఢ నమ్మకాల బాట పడుతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి.