షాకింగ్ : మాజీ స్పీకర్ ఎత్తుకెళ్లిన ఫర్నిచర్ ఇవే…

Thursday, August 22nd, 2019, 03:00:14 AM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై ఇప్పటికి కూడా వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి… ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుండి కూడా టీడీపీ నేతల మీద ఒక కన్నేసి ఉంచారనేది పక్క సమాచారం…. ఈ దెబ్బతో కోడెలతో పాటే ఆయన కుటుంబ సభ్యులు కూడా నిరంతరం వార్తల్లో ఎప్పటికి ప్రత్యక్షమవుతూనే ఉన్నారు.. కాగా కోడెల అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరీ కోడెల కుమారుడు మరియు కుమార్తె చేసినటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి… దానికి తోడు కోడెల ఏపీ అసెంబ్లీ ఫర్నిచర్‌ను సైతం తన ఇంటికి తీసుకువెళ్లిపోయారన్న ఆరోపణలు వచ్చాయి. తానూ ఫర్నిచర్ తీసుకెళ్లిన మాట వాస్తవమే అని నిజాన్ని అంగీకరించారు కోడెల…

కాగా కోడెల తీరుపై విసుగు చెందిన టీడీపీ నేత వర్ల రామయ్య లాంటి వాళ్లు కూడా కోడెల పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కనీసం అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శికి కూడా ఈ విషయాన్నిచెప్పకపోవడం అనేది కోడెల చేసిన పెద్ద తప్పుగా పరిగణిస్తున్నారు… ఈమేరకు తుళ్లూరు పోలీస్‌స్టేషన్లో అసెంబ్లీ సెక్రటరీ కోడెలపై ఫిర్యాదు చేశారు. కాగా అసెంబ్లీ ఫర్నీచర్ను హైదరాబాద్ నుంచి అమరావతి తరలిస్తున్న సమయంలో కోడెల దారి మళ్లించారని అసెంబ్లీ సెక్రటరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు…

కోడెల తీసుకెళ్లిన ఫర్నిచర్ లిస్ట్ ఇదే…

. ప్లాస్టిక్ చైర్స్ – 27
. బీఏసీ హాల్ చైర్స్ – 8
. డైనింగ్ హాల్ చైర్స్ – 7
. ఎగ్జిక్యూటివ్ చైర్స్ – 2
. సింగిల్ సీటర్ సోఫాలు – 3
. త్రీ సీటర్ సోఫా – 1
. డైనింగ్ టేబుల్ – 1
. బీఏసీ మీటిగ్ టేబుల్ – 1
. సెంటర్ టేబుల్ – 1
. చైర్స్ – 5
. విజిటర్స్ చైర్స్ – 5
. విజిటర్స్ చైర్స్ (పీకాక్ మోడల్ )- 14
. మెంబర్స్ లాండ్ చైర్స్ – 80
. మెంబర్స్ లాంజ్ ఉడెన్ చైర్స్ – 10