వీడియో : యానిమేటెడ్‌ ఫ‌న్ .. క‌డుపు చెక్క‌ల‌య్యేలా!

Friday, March 9th, 2018, 08:30:34 PM IST

యానిమేష‌న్ సినిమాల హ‌వా అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. బొమ్మ‌ల సినిమాలు, కార్టూన్ సినిమాలు ఎవ‌రు చూస్తారులే అన్న నోళ్లే యానిమేష‌న్ సినిమాల కోసం క్యూ క‌ట్టే ప‌రిస్థితి ఉందంటే న‌మ్మ‌గ‌ల‌రా? ఆంగ్ల భాష అన్న స‌మ‌స్య లేక‌పోతే తెలుగు రాష్ట్రాల్లోని మాస్‌లోనూ ఇవి దూసుకెళ్లేవే. అయితే ఏ భాష‌తో సంబంధం లేకుండా అద్భుత 3డి విజువ‌ల్స్‌తో మాస్‌- క్లాస్ అనే తేడా లేకుండా కొన్ని యానిమేష‌న్ సినిమాలు క‌ట్టిప‌డేస్తున్నాయి.

ఆ కోవ‌లోని సినిమానే ఇద‌ని ఇదిగో ఈ ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లు పుట్టిస్తున్న కామెడీ ఆషామాషీగా లేదు. క‌డుపు చెక్క‌ల‌య్యేలా నవ్వుకోవాల్సిందే. ముఖ్యంగా ఆ ఇంటి య‌జ‌మాని త‌న ప‌ప్పీని ప‌నిమ‌నిషిగా మార్చుకుని సాగిస్తున్న అరాచ‌కం ప‌డిప‌డి న‌వ్వుకునేలా చేస్తోంది. డిస్‌పెక‌బుల్ మి, సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్ చిత్రాల క్రియేట‌ర్స్ నుంచి వ‌స్తున్న మ‌రో ఫ‌న్నీ మిరాకిల్ మూవీ ఇది. `ది గ్రించ్‌` అనే టైటిల్‌తో న‌వంబ‌ర్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్రైల‌ర్ ని ట్విట్ట‌ర్‌లో చేశారు. మిస్ కాకూడ‌ని మాష్ట‌ర్ పీస్ ఈ సినిమా అన్న అంచ‌నాలు పెరిగాయి ఈ ట్రైల‌ర్ చూశాక‌.