వరుణ్ తేజ్ కోసం ఇంత భారీ సెట్టా..?

Wednesday, April 4th, 2018, 09:14:01 AM IST

నటనని రక్తంలో ఇమిడించుకున్న మెగా యువ హీరో వరుణ్ తేజ్. ఫిదా, తొలి ప్రేమ లాంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో దూసుకెళుతున్న వ‌రుణ్ తేజ్ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ని కూడా సిద్ధం చేసుకున్న సంగ‌తి విదితమే. ఘాజీ వంటి చిత్రంతో నేష‌న‌ల్ స్టార్‌డం పొందిన డైరెక్ట‌ర్ సంక‌ల్ప్ రెడ్డితో నెక్స్ట్ మూవీ చేయ‌నున్నాడు వ‌రుణ్‌. ఈ మూవీ త‌ర్వాత వెంకీతో క‌లిసి మ‌ల్టీ స్టారర్ ప్రాజెక్ట్‌లో పాల్గొన‌నున్నాడు. అయితే కొద్ది రోజులుగా సంక‌ల్ప్ రెడ్డి ప్రాజెక్ట్‌కి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా, మూవీని మేలో సెట్స్‌పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అంత‌రిక్షం నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, తెలుగులో ఇలాంటి సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. సైన్స్ ఫిక్ష‌న్‌తో అభిమానులని ఎంత‌గానో అల‌రించేలా ఈ చిత్రం ఉంటుంద‌ని టాక్‌. ఈ సినిమాలో వ‌రుణ్ స‌రికొత్త లుక్ లో కనిపించ‌నున్నాడు. అన్న‌పూర్ణ స్డూడియోస్‌లో భారీ బ‌డ్జెట్‌తో అంత‌రిక్షం సెట‌ప్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్రస్తుత స‌మాచారం. చిత్ర షూటింగ్ స‌గ‌భాగానికి పైగా ఈ సెట్‌లోనే జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. అదితిరావు హైద‌రి క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ చిత్రంలో ప్ర‌కాశ్ రాజ్ సైంటిస్ట్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. స్పేస్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమా కోసం వ‌రుణ్‌తేజ్ ప్ర‌త్యేక‌ శిక్ష‌ణ కూడా తీసుకుంటాడ‌ని స‌మాచారం. విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయట. ఇక ఈ చిత్రం వరుణ్ తేజ్ కి ఎంత పెద్ద హిట్ తెచ్చి పెడుతుందో వేచి చూడాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments