పంచాయితీరాజ్ చట్టం అమలుకు కీలక నిర్ణయం తీసుకున్న కెసిఆర్

Wednesday, June 12th, 2019, 01:32:14 AM IST

హైదరాబాద్ లోని తెలంగాణ ప్రగతి భవన్ లో కొత్తగా ఎన్నికైనటువంటి జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకపక్షంగా విజయం సాధించిన వారికీ కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పదవిలో ఉన్నంత కాలం ప్రజలందరికి అందుబాటుల ఉండాలని, ఎలాంటి సమస్యలు రాకుండా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కెసిఆర్ తెలిపారు. పదవి అధికారంతో సహజత్వాన్ని కోల్పోవద్దని, గ్రామా స్వరాజ్యం లక్ష్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా పని చేయాలనీ కెసిఆర్ సూచించారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో గ్రామీణ, పట్టణాభివృద్ధికి ఎలా పాటుపడాలనే అంశంపై వారికి సీఎం దిశా నిర్దేశం చేశారు. గ్రామాలన్నింటిలో ఎలాంటి సమస్యలు వచ్చిన కూడా తక్షణమే పరీక్షించాలని, తగిన సహాయాలు చేయాలనీ కెసిఆర్ చెప్పారు… కాగా గ్రామ వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్ లకు నిధులు అందిస్తామని, సీఎం ప్రత్యేక ప్రగతి నిధి నుంచి రూ.10 కోట్లు అభివృద్ధి నిధులు మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. కాగా కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలులో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. పూర్తీ అవగాహనతోనే పనులన్నీ సకాలంలో పూర్తీ చేయాలనీ, రానున్న ఆరు నెలల్లోనే మంచి మార్పు కనిపించాలని కెసిఆర్ వెల్లడించారు.