చైనా శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధన – కరోనా వైరస్ ఎక్కడ ఉంటుందో తెలుసా…?

Monday, May 25th, 2020, 08:22:57 AM IST


గత కొంత కాలంగా యావత్ ప్రపంచదేశాలను గజ గజ వణికిస్తున్నటువంటి మహమ్మారి కరోనా వైరస్ కి విరుగుడు కనిపెట్టాలని అన్ని దేశాల శాస్త్రవేత్తలు తీవ్రమైన కృషి చేస్తున్నారు. కాగా ఈ విరుగుడు కోసం చేస్తున్నటువంటి పరిశోధనల్లో పలు సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా ఈ మహమ్మారి కరోనా వైరస్ పురుషుల వీర్యంలో తలదాచుకుంటున్నట్లు తాజాగా చైనా శాస్త్రవేత్తలు జరిపినటువంటి పరిశోధనల్లో వెల్లడైందని అధికారికంగా ప్రకటించారు. కాగా వీరి పరిశోధనల కోసమని షాంఘ్‌ క్యు మునిసిపల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 38 మంది కరోనా రోగుల వీర్య నమూనాలను పరిశీలించారు.

కాగా వారు సేకరించిన వీర్యం నమూనాలో మహమ్మారి కరోనా వైరస్ దాగి ఉన్నట్లుగా స్పష్టం చేశారు. అంతేకాకుండా శరీర రక్షణ వ్యవస్థను తట్టుకొని ఈ ప్రాంతాల్లో వైరస్ మనుగడ సాగిస్తుందని, ఈ వైరస్ భారిన పది, పూర్తిగా కోలుకున్నప్పటికీ కూడా వారి వీర్యంలో మూడు నాలుగేళ్ల తర్వాత కూడా బతికే ఉంటుందని శాస్త్రవేత్తలు వివరించారు. అయితే ఈ వైరస్ దంపతులు కలిసిన సమయంలో భాగస్వామికి సోకే ప్రమాదం ఉందని వెల్లడించారు.