హరితహారం మొక్కలు ధ్వంసం చేసిన లారీ డ్రైవర్ – ఎంత జరిమానా విదించారో తెలుసా…?

Friday, May 22nd, 2020, 04:59:16 PM IST

సిద్ధిపేట జిల్లా ప్రాంతంలో హరితహారం కార్యాక్రమం ద్వారా నాటినటువంటి మొక్కలను ధ్వంసం చేసిన కారణంగా ఒక లారీ డ్రైవర్ కి రూ.10 వేల జరిమానా విధించారు. కాగా వివరాల్లోకి వెళ్తే… సిద్ధిపేట జిల్లా మున్సిపల్ పరిధిలోని రంగదాంపల్లి శివారులో డివైడర్ పై ఉన్నటువంటి దాదాపు 12 హరితహారం మొక్కలను ధ్వంసం చేసినందుకు గాను ఒక లారీ డ్రైవర్ కి రూ.10వేల జరిమానా విధించినట్లు హరితహారం మున్సిపల్‌ అధికారి సామల ఐలయ్య వెల్లడించారు.

అయితే ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఒక లారీ డ్రైవర్ ఎండీ సయ్యద్‌, అకస్మాత్తుగా డివైడర్‌పైకి లారీని ఎక్కించడంతో, అక్కడ నాటినటువంటి హరితహారం మొక్కలు తీవ్రముగా ధ్వంసం అయ్యాయని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి, అతడిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా అతడిపై జరిమానా కూడా విధించారు. కాగా ఈ విషయాన్నీ అంతటిని పోలీసులు, సదరు లారీ డ్రైవర్ కి వివరించగా, అందుకు సంబందించిన జరిమానాని మున్సిపల్‌ ఖాతాలో జమచేసినట్లు అధికారులు వెల్లడించారు.