నేల టిక్కెట్ పోరీ మాళ‌వికకు చాలా సీనుందే!

Friday, May 11th, 2018, 01:12:08 AM IST

టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన హాట్ మోడ‌ల్ కం క‌థానాయిక‌ మాళ‌విక శ‌ర్మ పేరు మార్మోగిపోతోంది. ప్ర‌స్తుతం ఈ భామ టాలీవుడ్‌ యువ‌హీరోలకు చ‌క్క‌ని ఆప్ష‌న్‌గా మారింది. నాని, సుధీర్‌బాబు, నారా రోహిత్‌ వంటి యువ‌హీరోల స‌ర‌స‌న‌ క‌థానాయిక‌గా అవ‌కాశాలు అందుకుంది. మాస్‌ మహారాజా రవితేజ స‌ర‌స‌న‌ కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్న `నేల టిక్కెట్‌`లో న‌టిస్తోంది. అలానే నాగార్జున‌- నాని మ‌ల్టీస్టార‌ర్‌లో నాని స‌ర‌స‌న న‌టిస్తోంది. మాళ‌విక రెండు టాప్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

ఇక మాళ‌విక‌లో ఎంతటి విజువ‌ల్ బ్రిలియన్సీ ఉందో నేల టిక్కెట్ ట్రైల‌ర్లు చెబుతున్నాయి. మాస్ రాజా నేల టిక్కెట్ ఈవెంట్‌లో క‌థానాయిక‌పై ప్ర‌త్యేకంగా ముచ్చ‌ట సాగింది. ఈ భామ‌కు టాలీవుడ్‌లో పెద్ద భ‌విష్య‌త్ ఉంద‌న్న టాక్ వినిపించింది. మొత్తానికి మాళ‌విక శ‌ర్మ ఆరంభ‌మే మంచి టాక్‌తో దూసుకొచ్చింది. ఇప్పుడున్న కీర్తి సురేష్‌, అనుప‌మ లాంటి నాయిక‌ల‌కు ఈ భామ థ్రెట్ గా మారుతుందేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments