హైదరాబాద్ ప్రజల సరికొత్త డిమాండ్ – ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…?

Wednesday, February 5th, 2020, 02:18:11 AM IST

చైనా నుండి పుట్టుకొచ్చినటువంటి కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తన బలగాన్ని పెంచుకుంటూపోతుందని చెప్పాలి… ఎంతలా అంటే కరోనా పేరు చెబితేనే ప్రపంచం అంతా కూడా బయపడేలాగా తయారయింది. ఇకపోతే ఈ వైరస్ వలన ఇప్పటికే చైనాలో దాదాపుగా 500 మందికి పైగా చనిపోయారు. కొన్ని వేల మంది ఇప్పటికే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ వైరస్ వలన ముగ్గురు భారతీయులు కూడా బాధింపబడుతున్నారని సమాచారం. హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో కరోనా అనుమానిత కేసులు మాత్రం నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు సరికొత్త డిమాండ్ చేస్తున్నారు.

నగర రహదారులపై పోలీసులు నిర్వహిస్తున్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని, అందువల్ల ఈ టెస్టులని కొద్దీ రోజులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఇప్పటికే వాదా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు సురేశ్ రాజు నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. కాగా పోలీసులు వాడే ఈ బర్త్ ఎనలైజర్ల ద్వారా ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి వచ్చే అవకాశం ఉందని, అందుకనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే నగరంలో ఇప్పటికే 50 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. కానీ ఏ ఒక్కరిలోనూ పాజిటివ్ మాత్రం రాలేదు.