నవంబర్ 1 నుండి కొత్త పెన్షన్ విధానం

Saturday, September 13th, 2014, 04:48:54 PM IST

ktr
తెలంగాణలో పంచాయితీరాజ్ వందరోజుల పాలనపై మంత్రి కేటిఅర్ హైదరాబాద్ లో నివేదికను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో రోడ్లు, మంచినీరు, డ్రైన్ల ఏర్పాటే తమ ప్రాధాన్యమని వివరించారు. అలాగే నవంబర్ 1 నుండి కొత్త ఫించన్ విధానం అమలు చేయనున్నట్లు కేటిఅర్ తెలిపారు. కాగా ఫించన్లను లబ్దిదారులకు చేర్చేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్లు మంత్రి కేటిఅర్ వివరించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ చిన్న నీటిపారుదల పునరుద్ధరణకు ఏటా వెయ్యి కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే 1,192 గిరిజన తండాలు, గూడేలను పంచాయితీలుగా గుర్తించామని మంత్రి వివరించారు. ఇక సమగ్ర సర్వేలో కోటి ఆరులక్షల కుటుంబాలకు పైగా తెలంగాణలో ఉన్నట్లుగా తేలిందని కేటిఅర్ తెలిపారు. వీటిలో 96లక్షల కుటుంబాల వివరాలలు కంపూటరీకరణ చేసినట్లుగా మంత్రి పేర్కొన్నారు. ఇక కొత్త పంచాయితీరాజ్ విధానాన్ని త్వరలో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. అలాగే ఉపాధి హామీలో అక్రమాలు, సమస్యల పరిష్కారానికి 1800 200 1001 హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లుగా మంత్రి కేటిఅర్ వివరించారు.