దిశ హత్యోదంతం : కేసులో సరికొత్త ట్విస్ట్ – ఎంతమంది సాక్షులో తెలుసా…?

Monday, December 16th, 2019, 11:26:50 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇంతటి దారుణానికి ఒడిగట్టినటువంటి నలుగురు మృగాలను పోలీసులు దిశ ని దహనం చేసిన ప్రదేశములోనే ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఈ నెలాఖరులోగా ఛార్జిషీటు వేయడానికి సైబరాబాద్ పోలీసులు ప్రణాలికను సిద్దం చేసుకుంటున్నారు. కాగా ఇప్పటికే ఈకేసుకు సంబందించిన DNA రిపోర్టులతో పాటు, ఫోరెన్సిక్ రిపోర్టులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని సమాచారం. దానికి తోడు ఈ కేసుకు సంబంధించి 50 మంది సాక్షులను కూడా పోలీసులు గుర్తించారు.

కాగా అత్యచారం, హత్య జరిగినటువంటి ప్రాంతంలో లభించినటువంటి సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా లభించిన ఆధారాలు, DNA రిపోర్టులు, ఫోరెన్సిక్ రిపోర్టులు అన్ని కూడా ఈ కేసులో కీలకంగా మారనున్నాయని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేశామని వీటన్నిటి వివరాలతో కలిపి ఒక చార్జిషీటు వేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఆ తరువాత కోర్టు దీనిపై విచారణ జరపనున్నదని సమాచారం.