ట్రైల‌ర్ టాక్‌: అన్ని దెయ్యాలు ఒకేలా ఉండ‌వు!

Tuesday, April 24th, 2018, 10:00:13 PM IST

హార‌ర్ సినిమాల ట్రెండ్ .. ఒర‌వ‌డిలో వ‌స్తున్న హిందీ సినిమా ఇది. టైటిల్ `ది ఫాస్ట్‌`. గ‌తంలో ఏం జ‌రిగింది? అన్న‌ది తెర‌పై చూపిస్తున్నారు. ఆ గ‌తానికి ఆత్మ‌కు సంబంధం ఏంటి? అన్న‌ది ఎలివేట్ చేస్తున్నారు. అయితే హార‌ర్ సినిమాల‌న్నీ ఒకేలా ఉంటే జ‌నం చూస్తారా? అంటే.. కాస్త విశ్లేష‌ణ‌లోకి వెళ్లాలి.

ఇటీవ‌లి కాలంలో రిలీజ‌వుతున్న హారర్ సినిమాలు ఎదురే లేకుండా మినిమం గ్యారెంటీ తో వ‌సూళ్లు ద‌క్కించుకుంటున్నాయి. ప్రేమ‌క‌థా చిత్రం, కాంచ‌న, గంగ‌, రాజుగారి గ‌ది, ఆనందో బ్ర‌హ్మ .. వంటి సినిమాలు తెలుగులో బంప‌ర్ హిట్లు కొట్టాయి. పిజ్జా, పిజ్జా 2 చిత్రాలు సైన్స్ బేస్డ్‌లో హార‌ర్ సినిమాలుగా వ‌చ్చి ఆక‌ట్టుకున్నాయి. అయితే వీట‌న్నిటికంటే భిన్నంగా `ది ఫాస్ట్` ట్రైల‌ర్‌లో ఏమీ క‌నిపించ‌లేద‌న్న‌ది వాస్త‌వం. ఉన్న విష‌యాన్నే ఎఫెక్టివ్‌గా చూపించిన తీరు మాత్రం క‌నిపిస్తోంది. సౌండ్ టెక్నాల‌జీలో నెక్ట్స్ లెవ‌ల్‌ని ట‌చ్ చేసేలా రీరికార్డింగుని అందించారు. ఆత్మ ఆవ‌హించాక ప‌రిణామాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో అద్భుతంగా చూపిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. పీకాక్ మోష‌న్ ఫిలింస్ ప‌తాకంపై జ‌స్పాల్ సింగ్ – నితేష్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు.