వాయిదా పడ్డ రవిప్రకాష్ కేసు…

Tuesday, June 11th, 2019, 10:39:27 PM IST

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కేసు మళ్ళీ వాయిదా పడింది. ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాష్ వేసుకున్న పిటిషన్ కి సంబందించిన కేసును న్యాయస్థానం మళ్ళీ వాయిదా ఏసింది. కాగా రవిప్రకాష్ తరపు న్యాయవాది దిల్జీత్ సింగ్ అహ్లువాలియా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారని తెలుస్తుంది. పోలీసులు చట్ట పరిధి దాటి వ్యవహరిస్తున్నారని, సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం మంచిది కాదని రవిప్రకాశ్ తరుఫు న్యాయవాది వాదించారు. కేవలం కుట్రపూరితమయిన వాదనలతోనే రవిప్రకాష్ ని కేసులో అక్రమంగా ఇరుక్కిస్తున్నారని, ఎన్‌సీఎల్‌టీలో విచారణ పెండింగ్‌లో ఉండగా, క్రిమినల్ కేసు ఎలా పెడతారని ప్రశ్నించిన లాయర్, కాపీరైట్ చట్టం ప్రకారం టీవీ9 లోగోపై రవిప్రకాశ్‌కే హక్కులుంటాయని వాదించారు.

అయితే రవిప్రకాష్ కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోరారు. రవిప్రకాష్ కావాలనే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, అందుకు సంబందించిన ఆధారాలను కూడా పోలీసులు కోర్టుకు అందజేశారు… అంతేకాకుండా రవిప్రకాశ్ పలువురు సాక్షులతో చాటింగ్ చేశారంటూ మొబైల్ స్క్రీన్ షాట్లను న్యాయస్థానానికి సమర్పించారు. అయితే టీవీ9 కి యజమాని తానె అని అందుకనే లోగోని అమ్ముకునే హక్కు తనకే ఉందని వాదిస్తున్నాడని పోలీసులు కోర్టు కి తెలియజేశారు. అంతేకాకుండా విచారణకు కూడా సరిగా హాజరు కాలేదని పోలీసులు తెలిపారు. కాగా ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి కేసుని ఈనెల 18 కి వాయిదా వేశారు.