ట్రైల‌ర్‌: అప్‌గ్రేడెడ్‌ ప్రిడేట‌ర్

Saturday, September 1st, 2018, 11:09:00 AM IST

ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గ‌ర్ న‌టంచిన ప్రిడేట‌ర్స్ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. అదృశ్య రూపంలో తిరిగే వింతైన ఏలియ‌న్ ఓ అడ‌విని స్థావ‌రంగా ఏర్ప‌రుచుకుంటుంది. అనుకోకుండా ఆ అడ‌విలో చిక్కుకుపోయిన కొంద‌రు ఆర్మీ ఆఫీస‌ర్ల‌ను ఆ ప్రిడేట‌ర్ ఎలా వేటాడింది? అన్న ఆస‌క్తిక‌ర క‌థాంశంతో తెర‌కెక్కించిన ఈ సినిమాలో ఆర్నాల్డ్ న‌ట‌న మైండ్ బ్లోయింగ్. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్నాల్డ్‌కి భీభ‌త్స‌మైన ఫాలోయింగ్‌ని తెచ్చిన సినిమా ఇది. అందుకే ఈ సిరీస్ నుంచి సినిమా వ‌స్తోంది అంటే అంద‌రిలో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంటుంది.

ఇప్పుడు ఈ సిరీస్‌లో కొత్త సినిమా రానే వ‌స్తోంది. `ది ప్రిడేట‌ర్స్` సెప్టెంబ‌ర్ 14న రిలీజ్ కానుంది. ట్వంటీయ‌త్ సెంచ‌రీ ఫాక్స్ నిర్మించిన ఈ చిత్రానికి `ప్రిడేట‌ర్` ఫేం షేన్ బ్లాక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తాజాగా రిలీజైన ట్రైల‌ర్ అభిమానుల్ని క‌ట్టిప‌డేస్తోంది. జెనెటిక‌ల్లీ అప్‌గ్రేడ్ అయిన‌ ప్రిడేట‌ర్స్ భూమ్మీద ఓ చిన్న గ్రామంపై ఎటాక్ చేశాక ఏం జ‌రిగింది? అన్న‌ది ఈ సినిమా క‌థాంశం. తాజాగా రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌లో ప్రిడేట‌ర్స్ వ‌ర్సెస్ హ్యూమ‌న్ ఎటాక్స్ విధ్వంశం ఆక‌ట్టుకుంటోంది. మ‌నుషుల్ని చీల్చి చెండాడుతూ అదృశ్య రూపంలో తిరుగుతున్న ప్రిడేట‌ర్స్ భీభ‌త్సం మామూలుగా లేదు. ఇంత ట్రాజిక్ సినిమాని కామెడీ వేలో ద‌ర్శ‌కుడు ఎలివేట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటోంది. ఇండియా బాక్సాఫీస్ వ‌ద్ద హాలీవుడ్ సినిమాలు క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతున్నాయి. ఆ కోవ‌లోనే ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేయ‌నుందో అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments