ప్రధాని రావాల్సింది, కానీ – వెనక్కి తగ్గిన కెసిఆర్

Saturday, June 15th, 2019, 03:30:23 AM IST

తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన, తెలంగాణ ప్రజల కళల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు… అయితే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటు ఈ ప్రాజెక్టు మొత్తానికి పూర్తయింది. కాగా ఈ ప్రాజెక్టుని ప్రారంభించేందుకు ముందుగా ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించాలంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అనుకున్నారు. కానీ తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కెసిఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. కాగా తెలంగాణ సీఎం కెసిఆర్ ఆహ్వానంమేరకు ఎపి, మహారాష్ట్ర సిఎంలు జగన్‌, ఫడ్నవీస్‌లు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

కాగా దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ చాలా హడావుడిగా అందరిని కలుసుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాల తరువాత కెసిఆర్ చాలా సైలెంట్ అయిపోయారు. అయితే ఏ సందర్భంగా మాట్లాడిన తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల్లో గెలుపోటములనేవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల మీద ఎలాంటి ప్రభావమూ చూపబోవని అన్నారు. అందుకని మునుపటిలాగే మోడీతో చట్టపరమైన ఉండే అన్ని పనులని చేసి చూపిస్తామని కేటీఆర్ అన్నారు.

అయితే ఒకవైపు కేంద్రంలో వరుసగా రెండవసారి అధికారాన్ని సాధించిన బీజేపీ, ప్రస్తుతానికి తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా పని చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకు గాను ఇటీవల తెలంగాణాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇటీవల ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర నాయకుడను లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణాలో అధికారం సాధించడమే లక్ష్యం అని చెప్పారు. అంటే ప్రస్తుతానికి తెలంగాణాలో తెరాస కి బీజేపీ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా మారుతుందని, అందుకని ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మోడీకి ఆహ్వానం అందలేదని పలువురు అంటున్నారు.