మోడీకి నామీద ఉన్న ద్వేశమే విమర్శలకు కారణం… రాహుల్ గాంధీ సంచలన వాఖ్యలు

Tuesday, January 8th, 2019, 09:00:19 PM IST

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలనాత్మక వాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ తనని ఇంతలా విమర్శించడానికి కారణం నామీద మోడీకి ఉన్న ద్వేషమే అని అన్నారు. మోడీ తో తానూ ఇంత వరకు మాట్లాడలేదని, మోడీ కూడా హలొ అని చెప్పడం కంటే ఒక్క మాట కూడా మాట్లాడారని రాహుల్ చెప్పారు. ఆలా తానూ మాట్లాడానికి కారణం తనపైన మోడీ పెంచుకున్న ద్వేషమే అని, ఇంకా కోపం అని రాహుల్ గాంధీ అన్నారు. మోడీ నామీద అంతలా కోపం పెంచుకున్నారని తెలిపారు. మా కుటుంబంలో జరిగిన విషాద ఘట్టాలను మోడీ ఎన్నటికీ కూడా గుర్తించలేరని, రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

మా కుటుంబానికి సంబందించిన మా నాయనమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్‌ గాంధీల హింసాత్మక మరణాల ప్రభావాన్ని మోదీ చూడలేరని దుయ్యబట్టారు. అంతటి బాధ నుండి మేము ఎలా బయటికి వచ్చామో, ఎలాంటి గుణపాఠాలు నెరుసుకున్నామో మోదీ గుర్తించకపోవడం విచారకరమన్నారు. నేను ఇప్పటికి చెప్తున్నాను… నేను రాజకీయ అనుభవం గల కుటుంబం నుండే వచ్చానని, ఆలా గర్వంగా చెప్పుకుంటున్నానని రాహుల్ అన్నారు.