జనసైనికుడి ఆత్మహత్యాయత్నం – కారణం ఏంటంటే…?

Thursday, May 21st, 2020, 02:28:19 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని, పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ కార్యకర్త లోకేష్ నాయుడు ఒక్కసారిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇతని తీరుతో ఒక్కసారిగా స్థానిక రాజకీయవర్గాల్లో కలకలం రేగింది చెప్పాలి. కాగా గత కొంత కాలంగా ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనను వేధిస్తున్నారనే, తీవ్రమైన మానసిక క్షోభకి గురి చేస్తున్నారని, గత రాత్రి పోలీసు స్టేషన్‌లో పురుగు మందు తాగి జనసేన కార్యకర్త లోకేష్ నాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఈ ఊహించని ఘటనతో ఆశ్చర్యానికి గురైన పోలీసులు వెంటనే స్పందించి, ఆ బాధితుడిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. కాగా ప్రస్తుత తీవ్రత కారణంగా రెడ్ జోన్ పరిధిలో ఆ ఆసుపత్రి ఉండడంతో, మరింత మెరుగైన చికిత్స నిమిత్తం ప్రవేటు ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా, అక్కడి స్థానిక అధికారులు అంగీకరించడం లేదు. కాగా రాజకీయ పలుకుబడి ఉన్నదన్న కారణంగానే సదరు ఎమ్మెల్యే ఇలా దారుణాలకు పాల్పడుతున్నాడని బాధితుడి కుటుంబ సభ్యులుకూడా చేశారు.