2.0 టీజర్ కి ఇప్పుడు కుదిరిన ముహూర్తం..!

Friday, September 7th, 2018, 05:30:45 PM IST

ఎప్పుడెప్పునా అని ప్రతీ భారతీయుడితో పాటు ప్రపంచ సినీ అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. అదే సూపర్ స్టార్ “రజినీకాంత్” హీరోగా ఇండియన్ జేమ్స్ కెమరూన్ గా పిలవబడే “శంకర్” ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 2.0. బాహుబలి రెండు చిత్రాల తర్వాత భారతీయ సినీ మార్కెట్ ఇంకా ఎక్కువ పెరిగింది. ఆ రెండు సినిమాల తర్వాత మళ్ళీ అంత బడ్జెట్లో ఈ పెద్ద సినిమా రాలేదు.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు దగ్గరలోనే ఉంది అని దర్శకుడు శంకర్ తన ట్విట్టర్ ద్వారా 2.0 టీజర్ తేదీని ఖరారు చేసినట్టు తెలియజేసారు. ఈ సినిమా 2010 లో విడుదల అయిన రోబో కి సీక్వెలే కానీ దాని తర్వాత నుంచి కొనసాగే కథ కాదు అని ఎప్పుడో తెలియజేసారు. 2.0 టీజర్ ని ఈ నెల 13వ తేదీన యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్టు తెలియజేసారు. ఈ సినిమాని 450 కోట్ల భారీ వ్యయం తో అస్సలు ఎక్కడా రాజీ పడనట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల విడుదల ఆలస్యం అయ్యింది. ఈ చిత్రం లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విల్లన్ పాత్రలో నటిస్తున్నాడు, అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం నవంబర్ 26న 3D లో విడుదల కానున్నది వేచి చూద్దాం ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో..

  •  
  •  
  •  
  •  

Comments